Samantha: మళ్లీ ఆ పని మొదలు పెట్టిన సమంత... ఫ్యాన్స్ ఫుల్ సీరియస్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేశావే అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వత అక్కినేని కోడలు అయింది. ఇక చైతుకి విడాకులు ఇచ్చాకా తన సినిమాలతో తను బిజీగా మారిపోయింది. మయోటైటిస్ భారీన తర్వాత సమంత ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత చేసిన ఓ పనికి ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు. అసలు సమంత ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్టార్ హీరోయిన్ సమంత.. ఏ మాయ చేశావే అంటూ తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. ఆ తర్వాత అక్కినేని వారి ఇంట కోడలుగా అడుగుపెట్టింది. నాగ చైతన్యను పెళ్లాడిన ఈ సమంత.. టాలీవుడ్ లో క్యూట్ కపూల్స్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరు విడిపోయినా.. వీరి గురించి వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి..

అయితే సమంత ఇటీవల ఖుషి సినిమాతో వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. వెకెషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు ఈ బ్యూటీ. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుందనే విషయం తెలిసిందే. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో తన అకౌంట్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.

ఇక తాజాగా సమంత జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్... మళ్లీ సమంత మొదలు పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే కొంచెం ఫైర్ మీద ఉన్నారు. దానికి కారణం ఆమె ఆరోగ్యం బాగాలేదు.. ఈ టైంలో అలాంటి హేవీ వర్కౌట్స్ అవసరమా సామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.



Click it and Unblock the Notifications











