Samantha Emotional Post: చైతు మూవీ జ్ఞాపకాలను తలుచుకుంటూ.. సమంత ఎమోషనల్ నోట్
హీరోయిన్ సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తుంది. ఇదిలా సామ్ తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తన మొదటి సినిమా షూటింగ్ ఇక్కడే చేసి.. కెరియర్ ప్రారంభించినట్లు.. ఇన్ స్టా గ్రామ్ లో సుదీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చింది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హీరోయిన్ సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు, తమిళ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్యను వివాహం చేసుకుని.. విడాకులు కూడా ఇచ్చేసింది. ఇక సామ్ ఇటీవల మయోసైటిస్ వ్యాధిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.

సమంత మయోసైటిస్ వ్యాధి ట్రీట్మెంట్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామ్ న్యూయార్క్ సిటీలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది. తాజాగా అక్కడి ఏటా గ్రాండ్ గా జరిగే ఇండియా డే పరేడ్ వేడుకల్లో పాల్గొంది. ఆమెతో పాటు ఈ వేడుకలకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు.

అయితే తాజాగా సామ్ షేర్ చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. సామ్ మొదటి సినిమా చైతన్యతో నటించిన ఏం మాయాచేశావే జ్ఞాపకాలను తలుచుకుంటూ రాసుకొచ్చింది. అందులో ఏం రాసిందంటే... చై న్యూయార్క్ రావాలాని చాలా మంది కలలు కంటారు. నేను మొదటి సినిమా షూటింగ్ను ఇక్కడే చేసి కెరియర్ ను ప్రారంభించాను. అసలు ఎలా సాధిస్తానన్న చిన్న క్లూ కూడా లేకుండా వచ్చిన ఆ చిన్న అమ్మాయి.. 14ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ పెద్ద కల కనేంత ధైర్యంతో ఉందంటూ.. సామ్ తన ఇస్టాలో రాసుకొచ్చింది.
న్యూయార్క్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొన్న సమంత.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవనేవి తాను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయని వెల్లడించింది. ఈ మూమెంట్స్ తన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని... ఈ అరుదైన గౌరవం దక్కినందుకు ధన్యావాదాలు తెలిపింది. తన సినిమాలను ఆదరిస్తున్న అమెరికన్ ప్రజలకు కూడా ఆమె థ్యాంక్స్ అని చెప్పింది.

ఇక ప్రస్తుతం సమంత హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ కన్సర్ట్ ఈ మధ్యే జరగింది. ఇక ఈ ఈవెంట్ లో విజయ్, సామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజ్ మీద షర్ట్ విప్పడం, సమంతను ఎత్తుకుని గిరగిరా తిప్పడం, సమంత, విజయ్ స్పీచులు ఇలా అన్నీ కూడా ఖుషి మీద బజ్‌ను క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











