Samantha: ప్రేమలో పడిన సమంత... ఏకంగా ముద్దులు పెడుతూ వీడియో రిలీజ్!
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తాను ప్రేమలో పడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చినీయాంశంగా మారింది. అసలు ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఏంటి? ఎందుకు దానిమీద అంతా చర్చ జరుగుతోంది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత... మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయి... కేవలం తెలుగు సినిమాలే కాదు తమిళం సినిమాలో కూడా చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మొదటి సినిమాలో నటించిన నాగచైతన్యతోనే ఆమె ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం కూడా చేస్తుంది.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ విడిపోతున్నట్లుగా రెండేళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత వీరు విడాకుల ప్రక్రియ కూడా జరిగింది. ఆ తర్వాత సమంత తన సినిమాలు తాను చేసుకుంటుంటే నాగచైతన్య కూడా తన సినిమాలు తాను చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో సమంత మయోసైటీస్ బారిన పడటంతో నాగచైతన్య సమంత ఇద్దరూ కలిసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఆ ప్రచారం కేవలం రూమర్స్ అని తేలాయి. ప్రస్తుతానికి సమంత రెస్ట్ మోడ్ లో ఉంది. నాగచైతన్య ఇటీవల దూత అనే వెబ్ సీరిస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. నేషనల్ వైడ్ గా నంబర్ 1 గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో సమంత ఒక పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సమంతకు కుక్కలంటే చచ్చేంత ప్రేమ అని ఇప్పటికే తెలిసిందే. నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు సమంత రెండు కుక్కలను పెంచుకున్న విషయం తెలిసిందే. వాటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటుంది సమంత. సామ్, నాగ చైతన్య కలిసి ఉన్నప్పుడు వాటికి హానీ కలగకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుకునే వారు. ఎక్కడికి వెళ్లిన తమ వెంట ఇవి తీసుకుని పోయే వారు..

అయితే వాటితో ప్రేమలో పడిపోయినట్లు సమంత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అంతే కాదు.. అవి సమంతకు ముద్దులు పెడుతూ ఉన్నాయి. వాటితో కలిసి సమంత ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సమంత కుక్కల పేర్లు వచ్చేసరికి హ్యాష్, సాషా. ఇటీవల హ్యాష్ బర్త్ డే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక సమంతను కుక్కలతో చూసిన నెటిజన్స్.. ఇలాగైన హ్యాపీగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











