Samantha సాహసం ఏకంగా ఆరు డిగ్రీల చలిలో.. అలా చేస్తూ.. వామ్మో!

స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సినిమాలు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సామ్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే... వామ్మో సమంత.. పెద్ద సాహసమే చేసిందిగా అంటారు. అదేంటో తెలుసుకుందాం.

విజయ్ తో కలిసి ఖుషి...:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత... ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఏ మాయ చేసావే అంటూ.. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అప్పటి నుంచి కుర్రాకారును మాయ చేస్తూ వస్తోంది. ఆ సినిమా సూపర్ హిట్టు తర్వాత తను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను కొట్టేసింది. వరుసగా సినిమాలు చేస్తూ... స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది. మరోవైపు వరుణ్ ధావణ్ తో కలిసి సిటడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Heroine Samantha Latest Ice Bath Video Viral in Social Media

ప్రేమపెళ్లికి ఫుల్ స్టాప్...:ఇదిలా ఉంటే.. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ పెళ్లి అంతగా సామ్ కు కలిసి రాలేదు. వీరి వివాహం ముణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఆ మధ్య విడాకులు తీసుకున్న ఈ జంట... విడివిడిగా ఉంటున్నారు. ఇక సామ్ విషయానికి వస్తే... మయోటైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పడిప్పుడే కోలుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.

Heroine Samantha Latest Ice Bath Video Viral in Social Media

ఒక ఏడాది బ్రేక్...:ఇక సామ్.. ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కారణం మయోటైటిస్ వ్యాధి మళ్లీ తిరగబడింది. అందుకే విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోబుతుందనే వార్తలు వస్తున్నాయి. అమెరికాలో చికిత్సకు వెళ్లడానికే సామ్ ఈ బ్రేక్ తీసుకుందని అంటున్నారు. త్వరలోనే ఆమె అమెరికా వెళ్లబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

వెకెషన్ లో ఎంజాయ్...:ఇదిలా ఉంటే.. సామ్ వెకెషన్ లో ఎంజాయ్ చేస్తోంది. కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ నుంచి తన ట్రిప్ ను మొదలు పెట్టింది సామ్. అక్కడనుంచి రెండు రోజులుకు ముందు మాల్దీవ్స్ కు వెళ్లింది. తన స్నేహితురాలు అనూష స్వామితో బాలిలో సమయాన్ని గడుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్ షేర్ చేస్తోంది. అక్కడి అందాలను, అందమైన ప్రదేశాలను షేర్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తోంది సామ్.

Heroine Samantha Latest Ice Bath Video Viral in Social Media

వీడియో వైరల్...:ఇక తాజాగా ఆమె ఐస్ వాటర్ లో కూర్చున్న వీడియోని షేర్ చేసింది. 'ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఆరు నిమిషాలు ఆ ఐస్ నీళ్లలో కఠినంగా కూర్చుని ఆ బాధను ఫీలవుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. కళ్ల నుంచి కన్నీళ్లు వస్తున్నా... అక్కడ నుంచి కదలకుండా కళ్లు మూసుకొని ఆరు నిమిషాలు అలాగే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదొక థెరపీ అని తెలుస్తోంది. సామ్ దాన్ని విజయవంతంగా ఫినిష్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X