ఆ విషయంలో పవన్ కల్యాణ్‌కు మరీ సిగ్గు ఎక్కువ..లీక్ చేసిన సమంత
Heroine Samantha: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే నేడు. పవర్ స్టార్ పవన్ 53వ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు అందిస్తూ పండగలా చేసుకొంటున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా కూడా ఫ్యాన్సే కాదు.. పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ సమంత కామెంట్స్ చేసిన ఓ వీడియో వైరలవుతుంది. ఆ వీడియోపై జనాసేనాని ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటీ? ఆ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఈ క్యూట్ బ్యూటీ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ తాను చాలా విషయాలు నేర్చుకున్నాననీ, కొన్ని విషయాల్లో తన ఇన్స్ఫైర్ చేశారని అన్నారు. ఆయన అమెజింగ్ పర్సన్ అంటూ కితాబ్ ఇచ్చారు. ఆయనకు ప్రజల్లో ఉన్న క్రేజ్ మాములు కాదు. ఆయన ఎక్కడ కనిపించిన పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ చూడటానికి ఎంతగానో ఆరాటపడుతారు. రియల్ గా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదని అన్నారు.

అత్తారింటికి దారేటి సినిమా షూటింగ్ సమయంలో ఓ విషయాన్ని పంచుకుంటూ.. ఆయనకు జనాల్లోకి రావాలంటే.. చాలా సిగ్గు.. చాలా షై గా ఫీల్ అవుతారని అన్నారు. షూటింగ్ సమయంలో ఎక్కువ మంది ఉంటే.. చేయగలనా? లేదా? అని సందేహ పడుతారనీ, ఆ సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చి.. పవన్ యూ కన్ డూ ఇట్ అనే వెళ్లేవారని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. సార్ మీరు పవర్ స్టార్.. మీరు షైగా ఫిల్ కావడమేంటని తాను అడిగితే.. రియల్ గా నేను చేయగలనా .. అంటూ యాక్ట్ చేసేవారని పవన్ పై సమంత కామెంట్స్ చేసింది. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటు సామ్ ఫ్యాన్స్ గానీ, అటు పవన్ ఫ్యాన్స్ గాని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ' కళ్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ! అంటూ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక గ్లోబల్ స్టార్ రాంచరణ్ కూడా తన బాబాయ్ పవన్ కి శుభాకాంక్షలు అందిస్తూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పుట్టిన రోజున సంతోషంగా జరుపుకోవాలని కోరుకొంటున్నాను. మీ బలం, మీ అంకిత భావం, మీ తపన ఎప్పుడూ నాకు మాత్రమే కాదు.. అందరికి స్పూర్తిని రగిలిస్తుంటాయని అనుకొంటాను. మీలో నిస్వార్థం, మీ నాయకత్వ పటిమ, ప్రజల కోసం, సామాజిక న్యాయం, మీరు చూపించే అంకిత భావం అద్బుతం. ఏపీలోని నిరుపేద కుటుంబాల కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం. మీకు మరింత బలాన్ని కల్పించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను'అని పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











