నా ఎక్స్ కి పెట్టింది అంతా వేస్ట్.. చైతూ విషయంలో సామ్ డైరెక్ట్ అటాక్
కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ మోస్ట్ ఫెవరెట్ జంట అక్కినేని నాగ చైతన్య - సమంతల విషయంలో పలు కాంట్రవర్సీలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకున్నాక విడిపోవడం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తన కెరీర్ లో భారీ సినిమాలతో బిజీగా ఉంటే సమంత కూడా పలు సినిమాలు సహా బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది.
సమంత రీసెంట్ గా చేసిన బాలీవుడ్ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" అందరికీ తెలిసిందే. ఈ నవంబర్ లోనే ఓటిటి లోకి వచ్చిన ఈ సిరీస్ భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లోనే తన మాజీ భర్త నాగ చైతన్య పైనే చేసిన కామెంట్స్ సహా పలు స్టేట్మెంట్ లు ఆ మధ్య ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

కాగా అవన్నీ ఏమో నిజంగానే తన కోసమే అన్నదో లేదో కానీ ఇపుడు మాత్రం డైరెక్ట్ గానే నాగ చైతన్యపై నేరుగా అటాక్ చేయడం గమనార్హం. కాగా అదే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంతకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ లైఫ్ లో దేనికైనా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారు కానీ అది వేస్ట్ అయ్యిపోయింది, ఇలా ఎప్పుడైనా జరిగిందా అని అడగ్గా.. నా ఎక్స్ కి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ విషయంలో జరిగింది అంటూ నవ్వుతూనే సమాధానం ఇచ్చేసింది సామ్.
మరి తన ఎక్స్ ఎవరు అంటే అది నాగ చైతన్యనే అందరికీ తెలుసు. ఇపుడు ఎలాగో విడిపోయారు కాబట్టి అతనికి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ వాటికి పెట్టిన డబ్బులు మొత్తం వేస్ట్ అంటూ సామ్ తెలిపింది. దీనితో ఇన్ని రోజులు చైతూపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తుంది అని అనుకున్న వారికి ఈసారి డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది అని చెప్పాలి.

కాగా గతంలోనే ఇదే సిటాడెల్ ప్రమోషన్స్ లో నిజ జీవితంలో ఎప్పుడైనా స్పై చేసారా అనే ప్రశ్నకి నిజానికి చేసి ఉండాల్సింది అంటూ కామెంట్ చేసింది సమంత. ఇది కూడా నాగ చైతన్య విషయంలోనే అన్నట్టుగా మొన్నామధ్య కామెంట్స్ వినిపించాయి. మరి మళ్ళీ ఇపుడు డైరెక్ట్ గానే చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
ఇక ప్రస్తుతం సమంత మరి క్రేజీ సిరీస్ తుంబాడ్ దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కిస్తున్న "రక్త బ్రహ్మాండ్" చేస్తుండగా ఈ సిరీస్ కాకుండా పలు సినిమాలు చేస్తుంది. అలాగే నాగ చైతన్య ఇపుడు తండేల్ సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత తన కెరీర్ 24వ చిత్రాన్ని విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మతో చేస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ గా మొదలు కాబోతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











