ఓ రేంజ్‌లో సమంత అందాల ప్రదర్శన.. కవర్ పేజ్ కోసం ఖతర్నాక్ షో

'ఏమాయ చేశావే' అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులు అందరినీ మాయ చేసేసిన బ్యూటీనే సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu). తనదైన అందం, అభినయంతో ఆడియెన్స్‌ను ఫిదా చేసేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకుని స్టార్‌గా మారింది. అప్పటి నుంచి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అయితే, ఈ మధ్య సినిమాలకు గ్యాపిచ్చిన సమంత.. అందాల ఆరబోతతో హైలైట్ అయిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

సామంతకు వరుస షాక్‌లు
ఒకప్పుడు గ్లామర్ పాత్రలనే చేసిన సమంత.. కొంత కాలంగా పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తోంది. ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేసి ఎన్నో హిట్లను అందుకుంది. అయితే, గత ఏడాది మాత్రం ఆమె 'శాకుంతలం', 'ఖుషి' వంటి సినిమాలతో వచ్చింది. ఇవి మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూశాయి. దీంతో సమంతకు వరుసగా షాక్‌లు తగిలాయి.

Heroine Samantha Ruth Prabhu Attractive Photos Viral

సమంత నుంచి అదొక్కటే
సినిమా నటిగా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా వరుసగా ప్రాజెక్టులను చేస్తూ వచ్చిన సమంత.. ఈ మధ్య కాలంలో మాత్రం స్పీడ్ తగ్గించింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు సమంత చేతిలో 'సీటాడెల్' వెబ్ సిరీస్‌ మాత్రమే ఉంది. దీని షూటింగ్ కూడా చాలా రోజుల క్రితమే ముగిసింది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది.

హెల్త్ కోసం బ్రేకిచ్చేసింది
చాలా కాలంగా సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌ మీద ప్రభావాన్ని చూపించే ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా దీనివల్లే సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సమంత ఆరోగ్యంపై శ్రద్ద చూపిస్తోంది.

Heroine Samantha Ruth Prabhu Attractive Photos Viral

అలాంటివి చేస్తూ మజాగా
హెల్త్ బాలేకపోవడంతో సమంత రూత్ ప్రభు సినిమాలు చేయడం లేదు. కానీ, ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ ఈవెంట్లు, వ్యాపార ప్రకటనల్లో నటిస్తోంది. అంతేకాదు, పెద్ద పెద్ద మేగజైన్‌ల కవర్ పేజ్‌ల కోసం ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ఇలా సినిమాలు లేకున్నా సమంత రూత్ ప్రభు ఏదో రకంగా తన అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగుతోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా
దాదాపు పదిహేనేళ్ల నుంచి ఏమాత్రం రెస్ట్ లేకుండా వరుసగా మూవీలు చేసి.. ఇప్పుడు ఖాళీగానే ఉంటోన్న సమంత రూత్ ప్రభు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో ఈ టాప్ హీరోయిన్ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మేటర్లను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో ముచ్చట్లు కూడా పెడుతూ వాళ్లను ఖుషీ చేసేస్తోంది.

Heroine Samantha Ruth Prabhu Attractive Photos Viral

గ్లామర్‌తో పిచ్చెక్కించేలా
హీరోయిన్‌గా ఎంటరైన కొత్తలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన సమంత రూత్ ప్రభు.. ఆ తర్వాత పంథాను మార్చుకుని ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ సెన్సేషన్ అయిపోతోంది.

కవర్ పేజ్ కోసం హాట్ షో
ఈ మధ్య కాలంలో సమంత రూత్ ప్రభు తనదైన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని ఓ మేగజైన్ కవర్ ఫొటో కోసం తీసుకున్న ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X