Samantha Ruth Prabhu విడాకుల విషయంలో నా తప్పేమి లేదు.. అంతా నాగచైతన్యదే.. బ్రేకప్‌పై సమంత సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు, నాగచైతన్య దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంపై అభిమానులు షాక్ తిన్నారు. అయితే సమంత, చైతూ వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకోవడంపై అనేక ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయాయి. సమంత, నాగచైతన్య బ్రేకప్‌లో ఎవరిది తప్పు అనే విషయంపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు మీడియాలో వచ్చాయి. అయితే నాగచైతన్యతో విడాకుల విషయంలో తప్పు ఎవరిదనే విషయంపై సమంత క్లారిటీ ఇచ్చారు. సమంత వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

అక్టోబర్ 2న విడాకుల ప్రకటన
సమంత రుత్ ప్రభు, నాగచైతన్య వివాహంలో లుకలుకలు ఉన్నాయనే వార్తలు మీడియాలో జోరుగా వినిపిస్తుంగానే.. రెండేళ్ల క్రితం అక్టోబర్ 2వ తేదీన సోషల్ మీడియాలో సంచలన వార్తను పోస్ట్ చేశారు. తాము దాంపత్య జీవితాన్ని కొనసాగించలేం. సామరస్యంగా విడిపోతున్నామని ఇద్దరు ఒకే ప్రకటనను తమ సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

శోభితా ధూళిపాలతో డేటింగ్
దాంపత్య జీవితంలో చోటుచేసుకొన్న అభిప్రాయ విభేదాలతో విడాకులు తీసుకొన్న తర్వాత ఎవరికి వారే తమ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే నాగచైతన్య మాత్రం పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల శోభిత ధూళిపాలతో లండన్‌లో రొమాంటిక్ డేటింగ్ చేస్తూ మీడియాలో వైరల్ అయ్యారు.

శాకుంతలం ప్రమోషన్‌లో సమంత
ఇదిలా ఉండగా, సమంత రుత్ ప్రభు ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ విషయంలో సంచలన విషయాన్ని బయటపెట్టారు. విడాకులు తీసుకోవడంలో తన తప్పు ఏమీ లేదు. అంతా నాగచైతన్య వల్ల జరిగిందనే విధంగా బ్రేకప్ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

100 శాతం నా వంతుగా సహకరించా
సమంత మీడియాతో మాట్లాడుతూ.. దాంపత్య జీవితం విషయంలో 100 శాతం నా వంతుగా ఇచ్చాను. అయినా నా వైవాహిక జీవితంలో బ్రేకప్ జరిగిపోయింది. అందులో నా తప్పేమి లేదు. బ్రేకప్ తర్వాత 6 నెలలు ఖాళీగా కూర్చొన్నాను. అప్పడే నాకు పుష్పలో ఊ అంటావా ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది అని సమంత చెప్పారు.

ఊ అంటావా ఐటెం సాంగ్ గురించి
పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉండకుండా స్పెషల్ సాంగ్‌లో ఎందుకు నటించావని ప్రశ్నించారు. అయితే ఆ పాటలోని లిరిక్స్ నచ్చి నేను చేశాను. అయితే తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదనిపించింది అని సమంత చెప్పారు.

నాగచైతన్యదే తప్పు అంటూ
సమంత రుత్ ప్రభు చేసిన వ్యాఖ్యలతో వైవాహిక జీవితం భగ్నం కావడంలో ఎలాంటి తప్పు లేదని తేల్చారు. తప్పంతా నాగచైతన్యదే అనే విధంగా సమంత ఘాటుగా స్పందించారు. అయితే సమంత వ్యాఖ్యలపై నాగచైతన్య ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే నాగచైతన్య స్పందిస్తారా? లేక అక్కినేని ఫ్యామిలీలో ఎవరైనా స్పందిస్తారా అనేది ప్రశ్నగా మారింది.


Click it and Unblock the Notifications











