Samantha: సమంతను నమ్మించి మోసం చేసిన మేనేజర్... ఇంతకీ ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ భామ నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత.. తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకంగా పనిచేసిన తన వ్యక్తిగత మేనేజర్ సామ్ ను ఆర్థికంగా మోసం చేయాలని చూశారని.. ఆమెకు తెలియకుండా దాదాపు రూ.కోటిని కాజేయడానికి ప్లాన్ వేశారని తెలు్స్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
సమంత త్వరలోనే 'ఖుషీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సామ్.. ఆ వెంటనే అమెరికాకు వెళ్లింది. మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోడానికే సామ్ అమెరికా వెళ్లిందంటూ ప్రచారం

అయితే ఇప్పుడు సమంత గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో నటీనటుల ఆర్థిక లావాదేవీలన్నీ వారి మేనేజర్ల చేతిలోనే ఉంటాయని తెలిసిందే. రెమ్యూనరేషన్స్ గురించి కూడా వారే నిర్మాతలతో మాట్లాడతారు. అయితే... సమంత మేనేజర్ దీన్ని అవకాశంగా మలుచుకుని అవకతవకలకు పాల్పడ్డాడని తెలుస్తోంది. సమంత డిమాండ్ చేసే పారితోషికం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తూ వెనకేసుకుంటున్నాడని, సమాచారం.
ఈ విషయం తెలిసుకున్న సమంత షాకైందని... అమెరికాలో ఉన్నప్పుడే సామ్ కు ఈ విషయం తెలిసిందని వార్తలు వస్తున్నాయి. అయితే సమంత ఖుషి సినిమా కోసం 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. అయితే తను అనారోగ్యం బారిన పడగానే తన రెమ్యూనరేషన్ 1కోటి రూపాయలకు తగ్గించిదట. అయితే ఈ మేనేజర్ మాత్రం.. రెండు కోట్లు డిమాండ్ చేశాడట. ఒక కోటి క్యాష్ అడగ్గా.. కుదరదని మూవీ మేకర్స్ చెప్పారట.

అయితే ఆ మూవీ మేకర్స్ కు ఈ మేనేజర్ ఓ అకౌంట్ నంబర్ ఇచ్చి ఇందులో సెండ్ చేయండని చెప్పడంతో.. అసలు విషయం బయటపడిదంని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రీట్మెంట్ నిమిత్తం ఆమె తన అకౌంట్ డిటైల్స్ చెక్ చెయ్యగా ఈ విషయాలు బయటపడ్డాయని తెలిసింది. సమంత మేనేజర్ సుమారు పదేళ్లుగా ఆమె వద్ద పనిచేస్తుండగా... ఆమెకు వచ్చే ఆఫర్లు నుంచి ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజరే స్వయంగా చూసుకొనేవారు.

అయితే, చాలామంది నిర్మాతలు ఆ మేనేజర్ ను తీసేయాలని సమంతకు సూచించేవారట. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని తీసేయడం సాధ్యం కాదని ఆమె చెప్పేదట. ఇక సమంతను మోసం చేయాలని చూసిన ఆ మేనేజర్.. ఒక్క సమంతకే కాదు.. చాలా మంది హీరోయిన్లకు మేనేజర్ గా ఉంటున్నారు. అంతే కాదు ఆ వ్యక్తి ఓ హీరోతో నిర్మాతగా మారి సినిమాను కూడా తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











