షర్ట్ బటన్ విప్పి మరీ చూపిస్తున్న సామ్... ఏంటమ్మడూ ఈ అందాల అరాచకం

స్టార్ హీరోయిన్ సమంత ప్రేమ పెళ్లి, విడాకులు, అనారోగ్యం తర్వాత హాట్ హాట్ ఫోటోలతో అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. తాజా ఫోటోలతో ఈ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో అందాల అరాచకం మొదలు పెట్టింది. షర్ట్ బటన్ విప్పి మరీ అందాల విందిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. మరి సమంత అంతగా అందాలు ఆరబోసిన ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

ప్రస్తుతం సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కాక రేపుతోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇంతకు ముందు కూడా సమంత గ్లామర్ క్వీన్ గానే ఉండేది. కానీ పెళ్లయ్యాక ఆ స్పీడును కాస్త తగ్గించింది. అయితే విడాకుల అనంతరం ఈ అమ్మడు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో హీట్ పెంచుతూ కుర్రాళ్ళ కంటికి కునుకు లేకుండా చేస్తోంది.

Heroine Samantha Ruth Prabhu Glamorous Photos in Black Dress

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది సామ్. అందులో పరువాలను దాచీ దాచనట్టుగా ఉన్న బట్టలు వేసుకుని సమంత ఇచ్చిన ఘాటు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏ మాయ చేసావే మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ తమిళ పొన్ను 2017 అక్టోబర్ 7న తాను ప్రేమించిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. నాలుగేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2021లో సడన్ గా విడాకులు తీసుకుంటున్నామంటూ షాక్ ఇచ్చారు.

ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడ్డ సమంత ఒకవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు కినిమాలు చేసింది. శాకుంతలం మూవీలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అదే స్థాయిలో భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత యశోద, ఖుషి వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.

Heroine Samantha Ruth Prabhu Glamorous Photos in Black Dress

ఆ తర్వాత తనకున్న మయోసైటిస్ కు చికిత్స తీసుకోవాలనే ఉద్దేశంతో దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరమైంది సమంత. ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీగా ఉన్న ఈ బ్యూటీ ఇంకా ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కానీ బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోంది. త్వరలోనే సిటాడెల్ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మరోవైపు సమంత బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని, అందుకే ఇంతగా అందాలు ఆరబోసి ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు అభిమానులను సంపాదించుకునే ప్రయత్నం చేస్తుందని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Read more about: samantha tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X