Samantha ఏపీ రాజకీయాల్లోకి సమంత.. ఏ పార్టీలోకి అంటే?
సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారు సినిమాల్లోకి రారేమో కానీ.. సినిమాల్లో రాణించేవారు మాత్రం చాలా వరకు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. ప్రజా సేవ పేరుతో ఏదో ఒక పార్టీలో చేరి తన ఇమేజ్ పరిధిని మరింత పెంచుకుంటారు. ఈ మధ్యే రీసెంట్గా తమిళంతో దళపతి విజయ్ రాగా, ఇప్పుడు తెలుగులో హీరోయిన్ సమంత రానుందని అంటున్నారు. దాని గురించే ఈ కథనం..
బోల్డ్ రోల్స్‌తో మరింత క్రేజ్
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరోయిన్ సమంత అంటే తెలియని తెలుగు ప్రజలు ఉండరేమో. ఒకప్పుడు క్యూట్ అండ్ లవ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత బోల్డ్ రోల్స్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఏమాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది.

అందాల ఆరబోతతో నిత్యం వార్తల్లో
ఆ తర్వాత లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఓ బేబీ, యూటర్న్, యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ సాంగ్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్ దక్కించుకుంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే పరన్సల్ లైఫ్‌లో డివర్స్, మయోసైటిస్ రోగం, సోషల్ మీడియాలో బికినీ అందాల ఆరబోత అంటూ నిత్యం వార్తల్లో నిలిచి మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ప్రచారం ముమ్మరం...
అలా రీసెంట్‌గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సమంత 14 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. కెరీర్లో ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకు సాగుతూ వెళ్తోంది. అయితే ఇప్పుడామె రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో అంతా అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచార సభలు నిర్వహిస్తుండంతో రాష్ట్రమంతా వేడెక్కింది.
వైసీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా
సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీలు జతకట్టి ప్రచార సభలు, కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తుండగా.. అధికార వైసిపి కూడా సిద్ధం పేరుతో ప్రతి విమర్శలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ - తమ పార్టీకి కాస్త గ్లామర్ డోస్‌ను యాడ్ చేసేందుకు సమంతను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బయట ప్రచారం సాగుతోంది. వైసీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతాను నియమించాలని అనుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

గతంలోనూ టీడీపీకి సపోర్టుగా...
ఇకపోతే గతంలోనూ సమంత ప్రతిపక్ష పార్టీ టీడీపీకి సపోర్ట్ చేస్తూ వీడియో బైట్ చేసినట్లు ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూడాలి మరి నిజంగానే సమంత ఈ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది. ప్రస్తుతం ఈ టాపిక్ ఆసక్తికరంగా మారింది. కాగా, సమంత తెలంగాణ రాజకీయాల్లో కూడా పాల్గొంటారని గతంలో ప్రచారం సాగింది. టీఆర్ఎస్ తరుఫున సమంత పేరు వినిపించింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలని అనుకున్నారని ఆ మధ్య కథలొచ్చాయి. కానీ కుదర్లేదట. ఇక ఆమె అక్కడ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశారు.


Click it and Unblock the Notifications











