36 ఏళ్ల ఏజ్‌లో మళ్లీ తెగించేసిన సమంత... పొదుపైన బట్టలతో హైడోస్ గ్లామర్ షో!
హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. చేతిలో సినిమాలు లేకపోయినా ఆమె క్రేజ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్. జస్ట్ ఒక్క గ్లామర్ ఫోటోతో దేశం మొత్తం చూపును తనవైపుకు తిప్పుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీసుతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పటికే సమంత అందాలతో రచ్చ లేపుతుండగా.. ఇప్పుడు దానికి మించిన ఫోటోతో షాకిచ్చింది. పొదుపైన బట్టలతో హైడోసు గ్లామర్ ట్రీట్ అందించింది ఈ బ్యూటీ. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
సమంతకు ప్రత్యేక స్థానం...:టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో సందేహం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి... కుర్రకారునే కాదు.. నాగచైతన్యను సైతం తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ బృందావనం, మహేష్ బాబు దూకుడు చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక నాగచైతన్యతో ప్రేమలో పడి.. పెళ్లి కూడా చేసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ వల్లే విడిపోయారా...:అయితే ఈ జంట ఎక్కువ కాలం నిలువలేదు. వీరు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు విడిపోయారు. అయితే వీరి విడాకులకు కారణం ఏంటో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వీరి విడాకుల విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఓ ప్రముఖ పొలిటిషియన్ ఫోన్ ట్యాపింగ్ చేయించడం వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఫోన్ ట్యాపింగ్ వల్లే ఈ జంట విడిపోయారని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
తన వర్క్ తో బిజీగా...:ఇదిలా ఉంటే.. సమంత అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ బ్యూటీ తన మ్యారేజ్ లైఫ్ కు పుల్ స్టాప్ పెట్టిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. అయితే మధ్యలో మయోసైటిస్ వ్యాధిబారిన పడటం.. సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో కాస్త డల్ అయింది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకెషన్స్, ట్రిట్మెంట్ అంటూ కొన్నాళ్లు తిరిగింది. తన చివరి సినిమా ఖుషి. విజయ్ దేవరకొండతో కలసి నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.

సిటాడెల్ సిరీసుతో...:ఖుషి చిత్రం తర్వాత సమంత మరొక సినిమాను ఒప్పుకోలేదు. ఇక హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ఎప్పటినుంచో చేస్తుంది. ఇక ఈ సిరీసులో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తుండగా.. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో దీని స్ట్రీమింగ్ వివరాలు బయటకు రానున్నాయి.

గ్లామర్ ట్రీట్...:ఇదిలా ఉంటే.. సమంత సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది. సమంత సెన్సేషనల్ షో ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే బికినీలో దర్శనం ఇచ్చి సోషల్ మీడియాను తన అందంతో ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అల్టీమేట్ ఫోటోను పంచుకుంది. ఇక ఆ ఫోటోలో తను టూపీస్ బికినీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో క్లీవేజ్ షోతో పాటు.. థైస్ షో చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోను చూసిన కుర్రాళ్లు ఆగలేక కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లైక్స్ చేస్తూ.. ట్రెండింగ్ చేస్తున్నారు. మీరు ఆ ఫోటోను చూసి.. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications











