Animal సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్... రిజెక్ట్ చేసి బతికిపోయిందిగా!

సినీ పరిశ్రమలో ఒకరు చేయాలనుకున్న సినిమాలు తర్వాత మరొకరు చేసిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఇలాంటి ఎన్నో పరిణామాలు మనం చూశాం... చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా రణబీర్ కపూర్, సందీప్ వంగా కాంబోలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. సమంత రుత్ ప్రభు. ఇక ఈ సినిమాను మిస్ చేసుకున్న సమంత భలే అదృష్టం చేసుకుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే....

వైల్డ్ మూవీ యానిమల్
తెలుగులో అర్జున్ రెడ్డి అనేది ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ హీట్ కొట్టడమే కాదు ఏకంగా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. బాలీవుడ్ కి వెళ్లి ఇదే అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేశాడు.

 Ranbir Kapoor Animal Movie News Goes Viral

సూపర్ రెస్పాన్స్...
వాస్తవానికి ఈ సినిమా చేయడానికి కంటే ముందే అర్జున్ రెడ్డి చాలా పద్ధతిగా ఉంటుందని... యానిమల్ లో అసలైన వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తానని అనౌన్స్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఆయన ఎలా అయితే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పాడో అంతే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాట జనాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటున్నాయి.

 Ranbir Kapoor Animal Movie News Goes Viral

రిజెక్ట్ చేసిన సామ్...
ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య జరుగుతున్న రొమాన్స్ అయితే ఒక రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో రష్మిక మందన్న కంటే ముందు సమంతను నటించమని అడిగారు. అయితే ఏమనుకుందో ఏమో తెలియదు కానీ... సమంత నటించినని రిజెక్ట్ చేసిందట. అలా రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని ఆమె అభిమానులు అంటున్నారు.

ట్రోలింగ్ ఉద్ధృతం అవుద్దని...
ఎందుకంటే సమంత ఇలా లిప్ లాక్ సీన్స్ లో కనిపిస్తే ఆమె మీద ట్రోలింగ్ మరింత ఉద్ధృతం అవ్వుద్దని అలాగే ఆమె ఖచ్చితంగా ఏదో తప్పు చేసిందని భావన అందరిలో కలిగేదని అంటున్నారు. సమంత ఈ సినిమా ఒప్పుకొని ఉంటే ఈ పాటికి అల్లరి అల్లరి చేసి ఉండేవారని అంటున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతపై ఎంత ట్రోలింగ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇక పుష్ప సాంగ్, ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ ల్లో నటించడం సమంతపై ట్రోలింగ్ ఎక్కువగా అయింది.

Heroine Samantha Ruth Prabhu rejected the movie

బతికిపోయిన సమంత...
యానిమల్ సినిమా రిజెక్ట్ చేసి మొత్తానికి సమంత మంచి పని చేసిందని అంటున్నారు. చివరిగా ఖుషి సినిమాలో కనిపించిన సమంత ప్రస్తుతం మయోసైటిస్ కారణంగా ఏర్పడిన అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతోంది. ఆమె కొన్నాళ్ళు అమెరికాలో ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఇప్పుడు ఇండియాలోనే రెస్ట్ తీసుకుంటుంది. అయితే తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చకి కారణమైంది. ఎందుకంటే ఆమె ఒంటి మీద ఉన్న నాగచైతన్య టాటూ చెరిపేసుకుందని ఒక చర్చ జరుగుతుండగా.. అది నిజం కాదని మరో చర్చ జరుగుతోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X