Samantha: ఇది టీజర్ మాత్రమే.. డేటింగ్ మ్యాటర్‌పై సమంత పోస్ట్ ట్రెండింగ్!
టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు సమంత రుత్ ప్రభు, నాగచైతన్య తమ దాంపత్య జీవితానికి ముగింపు చెప్పాలని నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే వారిద్దరూ విడిపోయిన తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోయారు. అయితే ఇటీవల తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ మరోసారి వారిద్దరి రిలేషన్స్ గురించిన వ్యవహారాలపై మీడియా కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో సమంత చేసిన ఇన్స్‌టాగ్రామ్ పోస్టు వివరాల్లోకి వెళితే..
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత లైఫ్‌లో రకరకాల ట్విస్టులు కనిపించాయి. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే. తీవ్రమైన వ్యాధిపై పోరాటం సాగించి విజయం సాధించి మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత తన కెరీర్‌పై ఆమె దృష్టి పెట్టారు. యశోద, సిటాడెల్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొన్నారు.

సమంతతో డైవోర్స్ తర్వాత నాగచైతన్య తన లైఫ్‌లోకి శోభితా ధూళిపాలను ఆహ్వానించారు. వారిద్దరి ప్రేమ చిగురించి పెళ్లి వరకు దారి తీసింది. ఇరు కుటుంబాల అంగీకారం, సమ్మతితో నాగచైతన్య, శోభితా ఇటీవల పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల చైతూ, శోభిత ఇద్దరు కలిసి తండేల్ సక్సెస్ మీట్‌లో సందడి చేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నది.
ఇదిలా ఉండగా, నాగచైతన్య తన గత వైవాహిక జీవితం గురించి తండేల్ ప్రమోషన్స్‌లో ఓపెన్ అయ్యారు. సమంతతో విడాకులకు దారి తీసిన విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నేను కూడా బ్రోకెన్ మ్యారేజ్ లైఫ్ నుంచి వచ్చాను. అలాంటి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఎవరు కూడా డైవోర్స్ తీసుకోవాలని అనుకోరు. సమంతతో విడాకుల విషయంలో 1000 సార్లు ఆలోచించాను. ఆ తర్వాత సమంత, నేను మా జీవితాల్లో ముందుకెళ్లాం. నేను శోభితాను పెళ్లి చేసుకొన్నాను. ఆమె కూడా తన ప్రేమలో ముందుకెళ్లున్నారు అని అన్నారు.
అయితే తన లవ్ లైఫ్ గురించి నాగచైతన్య కామెంట్స్ చేయడంపై పరోక్షంగా స్పందించారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వార్తల మధ్య వారిద్దరూ ఓ స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడం అలాంటి వార్తలకు బలం చేకూర్చింది. అలాంటి వార్తల మధ్య సమంత ఓ పోస్టు పెట్టి మరింత క్యూరియాసిటీని పంచారు.
తాజాగా సమంత తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఓ పోస్టు పెట్టారు. ఇది కేవలం టీజర్ మాత్రమే. ఇంకా ముందు చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా రెండు గ్లాసులతో ఒకరికి చీర్స్ కొడుతున్న ఫోటోను పోస్టు చేశారు. దాంతో నాగచైతన్య కామెంట్స్‌ను నిజం చేయబోతున్నారా? అనే నెటిజన్లు మాట్లాడుకొంటున్నారు. అయితే నర్మగర్బంగా చేసిన పోస్టుకు క్లారిటీ ఏమైనా ఇస్దుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











