Samantha: 500 రూపాయల కోసం హోటల్‌లో అలాంటి పని చేశా... షాకింగ్ విషయాలు బయటపెట్టిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చినా జనాల్లో మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు మానేసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు మయోటైటిస్ నుంచి కోలుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షాకింగ్ విషయాలు చెప్పుకువచ్చింది. 500 రూపాయల కోసం హోటల్ లో పని చేసినట్లు సంచలన విషయాలు బయటపెట్టింది. అసలు సమంతకు హౌటల్ లో పని చేయాల్సిన అవసరం ఏముందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఏ మాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. ఆ తర్వాత అక్కినేని వారసుడిని పెళ్లాడింది. కానీ కొన్నాళ్లాకే నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇక పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు, సిరీసులు చేస్తూ.. లైఫ్ ను ఫుల్ బిజీగా గడిపేస్తున్న వేళ మయోటైటిస్ బారిన పడింది.

ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మయోటైటిస్ చికిత్స తీసుకుంటూ వెకెషన్స్, టూర్స్ ఎంజాయ్ చేస్తుంది. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సమంత మెంటల్ గా స్ట్రాంగ్ కావడం కోసం ట్రై చేస్తూ.. అటు జిమ్ లో కసరస్తులు చేస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటి కప్పుడు తన గురించి, తన లైఫ్ గురించి ఈ వేదికగా పంచుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలోనే సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన బాల్యం గురించి.. సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశానని చెప్పుకువచ్చింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో ముచ్చడించిన ఈ భామ... ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడేవాళ్ళమని చెప్పుకువచ్చింది.

తన బాల్యంలో తనను బాగా చదువుకో అని తన తల్లిదండ్రులు చెప్పేవారని... తాను కూడా బాగా చదివేదాన్ని అని వెల్లడించింది. పై చదువులు చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితి ఆర్ధిక పరిస్థితి సహకరించలేదని ఎమోషల్ అయింది. ఆ టైం లో ఏ పని దొరికితే ఆ పని చేశాను అంటూ చెప్పుకువచ్చింది. ఓ వైపు చదువుకుంటూనే పని చేసేదాన్ని.. అలా ఓ స్టార్ హోటల్ లో పని చేశానని షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
ఆ స్టార్ హోటల్ లో వ్యాఖ్యాతగా చేస్తే... అప్పుడు తనకు నెలకు 500 ఇచ్చారని తెలిపింది. అదే నా మొదటి సంపాదన అని చెప్పుకువచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటజన్స్.. సామ్ ఇన్ని కష్టాలు పడిందా అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు చేయమని కోరుతున్నారు. ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉండగా.. సిటడెల్ సిరీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











