Samantha: "ఆ సినిమా ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు.. కచ్చితంగా థియేటర్లోనే చూడండి, డోంట్ మిస్"
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత రుతు ప్రభు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆరోగ్య సమస్యల వల్ల గ్యాప్ ఇచ్చిన ఈమె.. తాజాగా ఓ సినిమా చూసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా ఆ సినిమాను అందరూ చాడాలని, కచ్చితంగా థియేటర్లకు వెళ్లే ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని వివరించింది. ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత రుతు ప్రభు.. తాజాగా ఓ సినిమా చూసింది. ముఖ్యంగా మలయాళ భాషల్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆవేశం సినిమా గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం విమశ్రకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రాన్ని సమంత చూసినట్లు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులకు చెప్పింది. ముఖ్యంగా సినిమా చూసినప్పుడు తన మనసులో కల్గిన భావాలను వెల్లడించింది.

ఆవేశం సినిమాలో అన్ని రకాల పిచ్చి ఉందని.. ఆ పిచ్చి తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది. అన్ని రూల్స్ ను బ్రేక్ ఈ చిత్రంలో సీన్ సీన్ కు మధ్య జానర్ లు మారాయని తెలిపింది. ఈ సినిమాను చూస్తున్నంత సేపు తాను కడుపుబ్బా నవ్వుకున్నట్లు వివరించింది. అలాగే కొన్ని సార్లు భయపడ్డానని తెలిపింది. కొన్ని సినిమాలను కచ్చితంగా థియేటర్లలోనే చూడాలని.. అలాంటి వాటిల్లో ఆవేశం సినిమా ఒకటని హీరోయిన్ సమంత రుతు ప్రభు చెప్పుకొచ్చింది.

అలాగే ఫహాద్ ఫాజిల్ సినిమాలను సిమ్ కావొద్దని, ఆయన సినిమాలు వినోదాన్ని పంచుతాయని తెలిపింది. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు.. అలాగే మూవీ టీం అందరికీ స్ఫూర్తిని ఇచ్చిందని కూడా సమంత వెల్లడించింది. చివరగా ఆవేశం సినిమా చిత్రబృందానికి అభినందనలు తెలిపింది. సమంత చేసిన ఈ పోస్టుపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. పలువురు ఇప్పటికే ఈ సినిమా చూశామని, మరికొంత మంది చూస్తామని వివరిస్తున్నారు.

ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గ్యాంగ్ స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. అద్భుతమైన నటనతో ఫహాద్ ఫాజిల్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. ఆయనకు మంచి మార్కులు పడుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాపై పాజిటివ్ రీవ్యూలు ఇస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ చిత్రాన్ని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











