Samantha నాగచైతన్య చాలా అమాయకుడు.. మాజీ భర్తపై సమంత వైరల్ కామెంట్స్ వీడియో చూశారా?
నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలమే అవుతుంది. కానీ వీరి వార్తలు అంటే మాత్రం అందరికి ఆసక్తే. ఎప్పటికైనా వీరిద్దరు కలువకపోతారా అంటూ వీరి ఇద్దరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వీరు విడిపోయి చాలా కాలమే అయినప్పటికీ... ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే బతుకుతున్నారు.
దీంతో ఫ్యాన్స్ కాస్త ఆశగా వీరు కలుస్తారు అని చూస్తున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో తన భర్త అమాయకుడు అంటూ చెప్పుకువచ్చింది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి.

ముణ్ణాళ్ల ముచ్చటగా: చెన్నై భామ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ మాయ చేశావే అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తెలుగు ప్రేక్షకులనే కాదు.. నాగచైతన్యను మాయ చేసింది. తన అందంతో, చాలకితనంతో అందరిని మైమరిపోయేలా చేసింది. జెస్సీగా నాగచైతన్యను మాయ చేసి ప్రేమలో పడేసింది. ఇక అక్కినేని వారి ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. మరి ఏం జరిగిందో తెలియదు వీరి ప్రేమ ముణ్ణాళ్ల ముచ్చటగా మారింది.

షాకిచ్చిన సమంత: ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు కానీ.. విడిపోతున్నామంటూ ప్రకటించి ఫ్యాన్స్ అందరికీ షాక్ చేశారు. అయితే వీరు ఇద్దరు విడిపోయినప్పటికీ.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఇక నాగచైతన్య కూడా ఏ రోజు సమంత గురించి తప్పుగా మాట్లాడలేదు. సమంత మాత్రం ఇందుకు విభిన్నంగా కాఫీ విత్ కరణ్ షోలో మాజీ భర్త అంటూ షాక్ ఇచ్చింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. సమంత విడాకుల అనంతరం మయోసైటిస్ బారిన పడినట్లు తెలిపింది.
సినిమాలకు బ్రేక్ ఇచ్చి: ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. సమంత చివరి సినిమా దేవరకొండతో కలిసి ఖుషి చేసింది. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇక హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీసు చేస్తుంది. ఈ సిరీసు త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ మ్యాన్ వంటి సిరీసును తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీసును తెరకెక్కించారు. ఈ సిరీసుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

రానా ప్రశ్నలకు సామ్ ఆన్సర్: ఆ విషయం పక్కన పెడితే.. సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే అది ఇప్పటిది కాదు.. పాతదని తెలుస్తోంది. రానా హోస్టుగా నంబర్ 1 యారి ప్రోగ్రాం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఆ ప్రోగ్రాంకు నందినిరెడ్డితో పాటు సమంత అందులో పాల్గొంది. అందులో రానా అడిగిన ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమంత కూడా ఇంట్రెస్టింగ్ సమాధనం చెప్పింది. రానా మాట్లాడుతూ.. కూలెస్ట్, స్మార్టెస్ట్, రెబల్, ఫన్నీ, ఇన్నోసెంట్ ఎవరు అని అడిగాడు.
నాగచైతన్య ఇన్నోసెంట్: దీనికి సమంత స్మార్టెస్ట్... రానా, ఫన్నీ నందినీరెడ్డి, రెబల్ విజయ్ దేవరకొండ, కూలెస్ట్ రామ్ చరణ్ అంటూ చెప్పుకువచ్చింది. ఇక ఇన్నోసెంట్ మాత్రం మై హాస్బెండ్ నాగచైతన్య అంటూ చెప్పి స్మైల్ ఇచ్చింది. అయితే ఈ వీడియో వీరు విడాకులు తీసుకోకముందు అని అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్... మళ్లీ వీరు కలిస్తే బాగుండని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











