Samantha: సమంత వేదాంతం.. దాన్ని చంపితే హీరో.. మరి దీన్ని చంపితే ఎందుకు విలన్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సామ్.. ఇటీవల మయోసైటిస్ బారిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్... ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తూ.. జీవితాన్ని గడిపిస్తోంది. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చింది. విలన్, హీరో అంటూ రాసుకొచ్చింది. అదేంటో ఆ వివరాల్లోకి వెళితే...
ఏ మాయ చేశావే అంటూ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమంత... ఇక ఏళ్లు గడిచినా.. తన అందం, నటనతో మాయ చేస్తూనే ఉంది సమంత. ఇక టాలీవుడ్ స్టారోల సరసన నటిస్తూ.. తనదైన నటన, అభినయం, అందంతో ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. ఇక నాగచైతన్యతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు.. వీరు విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక ఇటీవల సమంత మయోటైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాను ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొంది. సినిమాలకు విరామం ఇచ్చిన సమంత... తన ఫ్రెండ్స్ తో కలిసి ఇండోనేషియాకి ట్రిప్ కు వెళ్లింది. గర్ల్స్ గ్యాంగ్ అంటూ అబ్బాయిలు ఎవరూ లేరని హింట్ ఇచ్చి... ఫ్రెండ్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. అంతే కాదు... ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. నెటిజన్స్, ఫ్యాన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేసింది.
ఇక సమంత నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీకి నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీశ్ దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వం వహించాడు. ఇక విజయ్ దేవరకొండ సరనస సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజయ్ సామ్ జోడిగా బాగుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సమంత.. తాజాగా ఓ సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చింది. తన ఇస్టా స్టోరీలో ఓ సిద్దాంతాన్ని రాసుకువచ్చింది. మీరు ఒకవేళ బొద్దింకను చంపితే హీరో అవుతారు... అదే సీతకోక చిలుకను చంపితే విలన్ అవుతారు... అంటూ రాసుకొచ్చింది. అంటే అందంగా ఉన్నదాన్ని చెరిస్తే అది తప్పు అన్నట్టు చెప్పుకొచ్చింది ఈ భామ. నెటిజన్స్ కు... అసలు ఈ భామ ఎవరి కోసం ఇలా రాసుకువచ్చింది.. ఎందుకు రాసింది అనేది అంతుపట్టడం లేదు.

ఏదీ ఏమైనా సమంత.. వచ్చే నెలలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఖుషి సినిమా ప్రమోషన్స్ కు సమంత వస్తుందో రాదోనని అంతా అనుకుంటున్నారు. మరోవైపు సామ్.. బాలీవుడ్ లో సిటడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. వరుణ్ ధావణ్ హీరోగా తెరకెక్కిన ఈ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











