Samantha ఆ పని మళ్లీ చేయను - ఒక్కసారికే వణికిపోయా : సమంత సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ సమంత రుత్ ప్రభు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేయకపోయినా సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. తన హాట్ ఫోటోషూట్స్, పాడ్ కాస్ట్, ఇంటర్వ్యూల ద్వారా ఎప్పుడూ తన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది. తాజాగా 'ఇండియా టుడే కాంక్లేవ్'లో పాల్గొని ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. తనకు ఓ పాట విషయంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే....

చైతూ ఫాలో...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో ది బెస్ట్ కపుల్స్ వీళ్లే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ చూసిన వీరే ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యేవి. అయితే సడెన్ గా సమంత విడాకులు అంటూ ప్రకటించి షాకిచ్చింది. ఇక నాగచైతన్య కూడా ఎప్పుడూ సమంత గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇక సమంత నాగచైతన్యను ఎన్నో సార్లు పరోక్షంగా అన్నా.. చైతూ మాత్రం ఇప్పటికీ సమంతను ఫాలో అవుతున్నాడు.

Heroine Samantha Shocking Comments on Pushpa Oo Antava Mawa Song Shoot Full Details Here

అభిమానులు ఫిదా...

ఆ విషయం పక్కన పెడితే.. సమంత తాజాగా 'ఇండియా టుడే కాంక్లేవ్' పాల్గొంది. అందులో తన గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చెప్పుకువచ్చింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేసిన 'ఊ అంటావా' సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఇక ఈ పాటలో సమంత రెచ్చిపోయి నటించింది. ఇక ఈ పాటకు అభిమానులు అంతా ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే.

అలా అనుకోవడం వల్లే...

అయితే ఈ పాటకు సంబంధించిన విషయాన్ని సమంత రివిల్ చేసింది. ఆ పాట షూటింగ్‌లో తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకువచ్చింది. ఈ విషయాన్ని 'ఇండియా టుడే కాంక్లేవ్'లో బయటపెట్టింది. ఇక ఈ పాట చేసేప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలోని రాజీ పాత్రకు పోలిక ఉంటుందనుకోవడం వల్లే ఊ అంటావా పాట చేశాను అంటూ చెప్పుకువచ్చింది. నేను నా చుట్టూ ఎక్కువ మంది లేకపోవడమే మంచిది అనుకునేదాన్ని.. అలా అయితే వారి అభిప్రాయాలను మనపై రుద్దరని భావించానని తెలిపింది.

Heroine Samantha Shocking Comments on Pushpa Oo Antava Mawa Song Shoot Full Details Here

అసౌకర్యంగా ఫీల్ అయ్యా...

అప్పుడు 'ఊ అంటావా' సాంగ్ చేయాలనుకున్నాను... నా సెక్సీ వల్ల ఎప్పుడూ అసౌకర్యంగానే ఉండేదాన్ని. నేనెప్పుడూ పూర్తి సౌకర్యంగా, విశ్వాసంతో ఆ విషయంలో లేను. ఇది సరిపోదని... నేను అందంగా లేను.. ఇతర అమ్మాయిల్లా కనిపించనని అనుకునేదాన్నంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఊ అంటావా' పాట షూటింగ్ సమయంలో నా వరకు అది చాలా పెద్ద చాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయమని తెలిపింది.

మళ్లీ అలాంటివి చేయను...

అందుకే ఆ పాట షూటింగ్ సమయంలో వణికిపోయానంటూ చెప్పుకువచ్చింది. అలాంటి అసౌకర్యమైన, కఠిన పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చానని వెల్లడించింది. పుష్ప 2లో మరోసారి ఇలాంటి పాట చేస్తారా? అని ప్రశ్నకు మళ్లీచేయను అంటూ తెలిపింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X