సమంత రేంజ్ అంటే ఇది.. షాప్ ఓపెనింగ్ కోసం ఎంత తీసుకుంటుందంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా సమంత తన రేంజ్ ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇటీవల నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకున్న అనంతరం తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది అనే చెప్పాలి. పుష్ప సినిమాలో కూడా ప్రత్యేకంగా చేసిన ఐటమ్ సాంగ్ తో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సమంత భారీ స్థాయిలో పారితోషకం అందుకుంది. ఇక ఇటీవల నల్గొండలో ఒక ప్రత్యేకమైన షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన సమంత లక్షలాది మంది అభిమానుల మధ్య లో సందడి చేసింది. ఆమెను చూసేందుకు అన్ని వర్గాల వారు ఎగబడ్డారు అనే చెప్పాలి. ఇక వారి ప్రేమకు సమంత కూడా ఫిదా అయింది. అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పటికీ ఆమె అభిమానుల ప్రేమకు కొద్దిసేపటి వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
స్టార్ హీరోల రేంజ్ లో సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని ఈ ఉదాహరణ తో మరోసారి రుజువయింది. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం తన సినిమా కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. డిఫరెంట్ ప్రాజెక్టులను కూడా ఓకే చేసేందుకు ముందుకు వెళుతోంది. కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసే విధంగా సమంత అడుగులు వేస్తోంది. నల్గొండలో షాప్ ఓపెనింగ్ కోసం వెళ్లిన సమంతకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అనే చెప్పాలి. సాధారణంగా సమంత ఒక సినిమాకు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. ఇక షాప్ ఓపెనింగ్ కోసం ఆమె ఏ తరహాలో ఛార్జ్ చేస్తుంది అనే ఈ విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

అందుకోసం దాదాపు 20 లక్షలకు పైగానే షాప్ ఓపెనింగ్ కు కోసం ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంతా కేవలం షాప్ ఓపెనింగ్ కోసం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వారికి సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్ కూడా చేస్తుంది. దీంతో ఆమె ఈ స్థాయిలో వసూలు చేయడంలో తప్పులేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒక విధంగా సమంత స్టార్ హీరోల రేంజ్ లో తన స్థాయిని పెంచుకుంటుంది అని కూడా చెప్పవచ్చు. గత ఏడాది వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేతోనే మరొక ప్రాజెక్టును చేసేందుకు ఒప్పుకుంది. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే సమంత నుంచి శాకుంతలం అనే సినిమా కూడా రాబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే రానున్న రోజుల్లో సమంత తమిళ్ తెలుగులో మరికొన్ని సినిమాలను స్టార్ట్ చేయనుంది.


Click it and Unblock the Notifications











