Samantha పవన్​ కల్యాణ్​తో తనకున్న రిలేషన్​ గురించి చెప్పిన సమంత - ఇది విన్నారంటే..?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దంకు పైగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులకు ఎంతో చేరువ అయింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక ఈ భామ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పవన్ కు, సమంతకు మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పుకువచ్చింది. సమంతే చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు పవన్ కల్యాణ్ గురించి సమంత ఏం చెప్పింది.. వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఏ మాయ చేశావే అంటూ ప్రేక్షకులను అలరించింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసి.. తన మాయలో పడేసుకుంది. ఇక అక్కినేని వారి ఇంటికోడలిగా అడుగుపెట్టింది. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో నాగచైతన్య, సమంత జంటకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. మరి ఈ జంటకు ఏమైందో తెలియదు విడిపోతున్నామంటూ ప్రకటించి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు షాకిచ్చారు. అయితే విడిపోయిన వీరి గురించిన వార్తలు మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Heroine Samantha talks about her relationship with Pawan Kalyan Video Goes Viral

ఇక ఆ విషయం పక్కన పెడితే.. సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత సినిమాలు తగ్గించేసింది. అయితే ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. సమంత చివరిగా ఖుషి అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీసులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సీరిస్ డబ్బింగ్ పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం చిల్ కొడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్స్, టూర్స్ అంటూ దేశాలు తిరుగుతుంది. మరోవైపు అందాల ఆరబోత కూడా మామూలుగా ఉండటం లేదు. మొన్నటికి మొన్న బికినీలో కనిపించి మళ్లీ పాత సమంతను గుర్తు చేసింది. ఇక ఆ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు సైతం నెట్టంట వైరల్ గా మారాయి.

సమంత పాత వీడియోలు అన్ని వైరల్ గా మారుతున్నాయి. యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ఓ షోలో సమంత పాల్గొంది. అందులో ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు సామ్ ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ చేసింది. ఒక హీరోకు ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏం ఇస్తావ్ అని అడిగాడు ప్రదీప్. మొదట జూనియర్ ఎన్టీఆర్ అనగానే సమంత ది గ్రేట్ డ్యాన్సర్ అంటూ సమాధానం చెప్పింది. సూర్య అనగానే స్మార్ట్ అండ్ హాట్ అంటూ చెప్పుకువచ్చింది.

ఇక మహేశ్ బాబుకు మోస్ట్ డిసరైబుల్ అంటూ చెప్పుకువచ్చిన సామ్... పవన్ కల్యాణ్ కు మాత్రం సమంత ఆసక్తిగా ట్యాగ్ లైన్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ గురువుగారు అంటూ చెప్పుకువచ్చింది. తనకు పవన్ కల్యాణ్ కు గురుశిష్యూల అనుబంధం అంటూ వెల్లడించింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు వీరు ఇద్దరు కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వీరి జంటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X