భర్తతో కలిసి గాలిలో సమంత యోగాసనం.. ఇలా చేస్తే ఏ రోగాలు రావట.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తన అందంతోనే కాకుండా ఫిట్నెస్ తో కూడా ఆశ్చర్యపరిస్తూ ఉంటుంది. జెస్సి ఎంట్రీ ఇచ్చి పదేళ్లవుతున్నా ఇంకా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మొత్తానికి అక్కినేని వారసుడు ఈ అందాల రాణిని దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ప్రస్తుతం ఈ స్టార్ కపుల్స్ కలిసి యోగాలు చేస్తున్నారట.

కష్టమైన యోగాసనం..

కష్టమైన యోగాసనం..

తన భర్త చైతన్యతో కలిసి మంచి మంచి యోగాసనాలు చేస్తున్నట్లు సమంత వివరణ ఇచ్చింది. కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసిన ఈ యంగ్ బ్యూటీ ఒక యోగాసనం చాలా కష్టంగా చేసినట్లు తెలుస్తోంది. రెండు చేతులతో మొత్తం బాడీని మోసేలా చేసిన యోగాసనం ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ముఖ్యమైన యోగసనం..

ముఖ్యమైన యోగసనం..

దానివల్ల చాలా ఊపయోగలు ఉన్నాయి అంటూ గత కొన్ని నెలలుగా తాను యోగా చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ముఖ్యంగా 48 రోజుల పాటు ఈషా క్రియ ప్రయాణంలో ఉన్నట్లు చెబుతూ మీరందరు కూడా నాతో కలవండి అని తెలిపింది. ఎందుకంటే ఆ యోగాసనం మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని సమంత పేర్కొన్నారు.

నాగచైతన్యతో కలిసి..

నాగచైతన్యతో కలిసి..

ఇక చైతన్య కూడా తనతో రోజు యోగా చేస్తున్నట్లు సమంత తెలిపింది. ఇక సమంత యోగాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సమంత చాలా సార్లు యోగాకి సంబంధించిన టిప్స్ ఇస్తూ నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
ఆమెకు కరోనా రావడంతో..

ఆమెకు కరోనా రావడంతో..

ఇటీవల సమంతను కలిసిన స్నేహితురాలికి కరోనా రావడంటతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. నాగ చైతన్య, సమంత కలిసే ఉంటున్నారు. అయితే అక్కినేని కపుల్స్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని ఎలాంటి ప్రమాదం లేదని వారి సన్నిహితులు తెలిపారు. ఇక సమంత త్వరలో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేయనుండగా.. నాగ చైతన్య లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X