సైజ్ పెంచమని ఇబ్బంది పెట్టారు.. సినిమాల్లో అలా కవర్ చేశాను: సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది భామలు తమదైన చిత్రాలతో సందడి చేశారు. అందులో చాలా మంది సక్సెస్‌లను అందుకుని సత్తా చాటగా.. కొందరు మాత్రం ఫ్లాపులతో కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకున్నారు. అలాంటి వారిలో తెలుగు భామ సమీరా రెడ్డి ఒకరు. టాలీవుడ్‌లో ఫ్లాప్ హీరోయిన్‌గా చెడ్డ పేరు తెచ్చుకున్న ఈ భామ.. వేరే భాషల్లో మాత్రం సత్తా చాటింది. ఇక, ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటోన్నా.. తరచూ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసమే!

అలా వచ్చిన తెలుగు భామ:తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలోనే సమీరా రెడ్డి జన్మించింది. చిన్న వయసులోనే ఈ అమ్మడు మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలనూ చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు సినిమా ఆఫర్లు వచ్చాయి.

Heroine Sameera Reddy Reveals about Acting Career Struggles

టాలీవుడ్‌లో డిజాస్టర్లతోనే:సమీరా రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసినా ఇది కూడా డిజాస్టర్ అయింది.

పెళ్లి చేసుకుని గ్యాపిచ్చి:టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చినా వేరే భాషల్లో సినిమాలు చేసిన సమీరా రెడ్డి.. 2014లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఫ్యామిలీతోనే ఎక్కువగా గడుపుతోంది.

Heroine Sameera Reddy Reveals about Acting Career Struggles

సినీ ప్రపంచంలో కష్టాలు:ఈ మధ్య కాలంలో సమీరా రెడ్డి పర్సనల్ లైఫ్‌తో పాటు మహిళల బ్యూటీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన విషయాలను మరోసారి గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా సరైన ఫిజిక్‌ను కాపాడుకోవడం కోసం ఎన్నో కష్టాలు అనుభవించినట్లు చెప్పింది.

సర్జరీ చేయించుకోమని:తాజా ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. 'హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో నా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని చాలా మంది ఎగతాళి చేసేవారు. అంతేకాదు, వాటి సైజ్‌ను పెంచుకునేందుకు సర్జరీ చేయించుకోమని కొందరు సలహాలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో నాలో ఏదో తెలియని ఒత్తిడి పెరిగిపోయింది' అని వెల్లడించింది.

Heroine Sameera Reddy Reveals about Acting Career Struggles

అలాగే కవర్ చేసేదాన్ని:సమీరా రెడ్డి కంటిన్యూ చేస్తూ 'నా బ్రెస్ట్ సర్జరీ గురించి చాలా మంది చెప్పడంతో ఆలోచనలో పడిపోయాను. చాలా రోజుల పాటు దాని గురించి ఎంక్వైరీ చేశాను. ఒక దశలో సర్జరీ వరకూ వెళ్లి ఎందుకులే అని ఆపేశాను. కానీ, బ్రెస్ట్ పెద్దగా కనిపించడం కోసం ప్యాడ్స్ వాడేదాన్ని. ఇలాంటి కఠినమైన పరిస్థితుల నుంచి నేను చక్కగానే బయటపడ్డాను' అని చెప్పుకొచ్చింది.

నేను అలా చెప్పను కానీ:చివర్లో సమీరా రెడ్డి 'నేను సర్జరీ చేయించుకుని ఉండుంటే ఇప్పుడు సుఖంగా ఉండకపోయేదాన్ని అని నాకు తెలుసు. అయితే, ఇప్పుడు నేను సర్జీలు వద్దని చెప్పడం లేదు. ఒకవేళ ఎవరికైనా అది సంతోషాన్ని కలిగిస్తే నేను తప్పుపట్టను. ఎవరి ఇష్టం వాళ్లది. అందుకే ఈ విషయంలో నేను ఎలాంటి సలహాలను ఇవ్వలేను' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X