జైలు గేటు ముందే మొండికేసిన సంజన గల్రానీ.. భయంతో లోపలికి వెళ్లనంటూ..
బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజనా గల్రానిని మొత్తానికి జైలుకు తరలించారు. మొన్నటివరకు ఒక సాదారణ సెల్ లో ఉన్న ఆమె ఇప్పుడు ఆమె పరప్పర అగ్రహారా కారాగారానికి వెళ్లింది. అక్కడ ఆమె ఊహించని జీవితాన్ని గడువుతోంది. డ్రగ్స్ కేసులో నటి రాగిణి ద్వివేదితో పాటు సంజనా అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆమె బెయిల్ విచారణ వాయిదా పడడంతో జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.

మొదటిసారి కారాగారా జీవితం
శాండీల్ వూడ్ సినీమా ఇండస్ట్రీలో గతకొంత కాలంగా డ్రగ్స్ రాకెట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక విచారణలో సంజనా, రాగిణిలకు మాధకద్రవ్యాలతో దగ్గరి సంబంధం ఉందని సరఫరా కూడా చేసినట్లు కొన్ని విషయాలు బయటపడడంతో అరెస్ట్ చేశారు. ఇక సంజనా మొదటిసారి తన జీవితంలో కారగారా జీవితాన్ని చూస్తోంది.

మొండికేసిన సంజనా
పరప్పన అగ్రహార కారాగారం లోపలకు తీసుకువెళుతుంటే సంజనా మొహంలో ఒక భయం కనిపించింది. ఆమె మొదట జైలులోకి వెళ్ళడానికి మొండికేసింది. మీడియాతో పాటు చాలా మంది జనాలు ఆమె జైలు గేటు దగ్గరకి రావడం చూశారు. అంతే కాకుండా ఫొటోలు కూడా తీసుకోవడం సంజనాకు ఇబ్బందిని కలిగించింది.

అధికారులు బెదిరించడంతో..
మొన్నటివరకు ఏసీ గదులలో ఒక మహారాణిలా గడిపిన సంజనా జీవితంలో మొదటిసారి ఒక భారీ కారాగారా గేటును చూసేసరికి భయంతో వెనుకడుగు వేసింది. చిన్న గేటులో నుంచి తల దించుకొని వెళ్లాలని చెప్పగా ఆమె పెద్ద గెటును తెరవాలని కాస్త మొండికేసింది. కానీ పోలీసులు అలానే వెళ్లాలని బెదిరించడంతో చివరకు సంజనా చిన్న గేటులోంచి లోపలికి వెళ్ళింది..
Recommended Video

అర్జీ విచారణ శుక్రవారానికి వాయిదా
సంజనా వేసుకున్న జామీను అర్జీ విచారణ శుక్రవారానికి వాయిదా పడడంతో ప్రత్యేక వైద్య పరీక్షల అనంతరం నేరుగా కారాగరానికి తరలించారు. ఇక ఈ కేసు విషయంలో మరిన్ని వివరాల కోసం సీబీఐ అధికారులు మరింత లోతుగా విచారణలు జరుపుతున్నారు. ఇప్పటికే విచారణ కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక లిస్ట్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. అందులో సినీ హీరోలు కూడా ఉన్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











