Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
జైల్లో హీరోయిన్స్ కష్టాలు.. దోమల మధ్య నిద్ర లేని రాత్రులు, ఆహారం మరీ దారుణం
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బుజ్జిగాడు హీరోయిన్ సంజనా గల్రాని పరిస్థితి దారుణంగా మారినట్లు కన్నడ మీడియాలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంతవరకు ఆమెపై వచ్చిన ఆరోపణల వెనుక అసలు నిజాలు తెలియరాలేదు. ఇంకా చాలా మంది ఉన్నారని పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే విచారణలో పూర్తిగా నిజాలు బయటకు వచ్చిన తరువాతనే కేసు విషయాన్ని మీడియాకు తెలపాలని అనుకుంటున్నారు. ఇక సంజనా, రాగిణి ప్రస్తుతం పరప్పన అగ్రహారా కారాగారంలో ఉన్నారు.
రెండు రాత్రులు చాలా నరకంగా..
బుధవారం జైలుకు వెళ్లిన సంజనా అక్కడ అలవాటు పడడానికి చాలా ఇబ్బంది పడింది. మొదటిరోజే జైలు గేటు దాటడానికి కూడా ఆమె భయపడింది. ఇక మొత్తానికి రెండు రాత్రులు చాలా నరకంగా అనిపించిందట. ఒక సాధారణ ఖైదీని ఎలా ఉంచుతారో ఆమెను కూడా అలానే ఉంచారట. సంజనాతో పాటు, మరో కన్నడ నటి రాగిణిని కూడా ఒకే గదిలో వుంచినట్లు తెలుస్తోంది.
నిద్ర కూడా పట్టడం లేదు..
వారు తెచ్చుకున్న పుస్తకాలతోనే కాలాన్ని గడిపేస్తున్నారట. ఇక ఆహార విషయంలో జైలు అధికారులకు ఫిర్యాదు చేశారట. దోమలు, ఈగల వల్ల జైల్లో ఇబ్బందిగా ఉందంటూ నిద్ర కూడా పట్టడం లేదని అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక వారిని కలిసేందుకు గురువారం తల్లిదండ్రులు జైలుకు వచ్చారు. కుటుంబ సభ్యులను చూడగానే సంజనా కన్నీరుమున్నీరుగా విలపించింది.
సంజనా కోసం పండ్ల రసాలు తెచ్చినా..
సంజనా కోసం వారు బట్టలు అలాగే ఆహారం, పండ్ల రసాలను, చాక్లెట్లను తెచ్చారు. అయితే జైలు అధికారులు వాటిని ఇవ్వవద్దని రూల్స్ ప్రకారం వెనక్కి ఇచ్చేశారు. కేవలం బట్టలు మాత్రమే సంజనాకు అందించారని తెలుస్తోంది. సంజనాతో కొంతసేపు మాట్లాడిన తల్లిదండ్రులు ఆమె బాధను చూసి వారు కూడా కంటతడి పెట్టారు.
Recommended Video
ఆమె గది నుంచే బయటకు రావడం లేదు
ఇక మరో హీరోయిన్ రాగిణి జైలు నుంచి బయటకు రావడానికి ఇష్టపడటం లేదట. ఆమె ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కనీసం బ్యారక్ వెలుపల తిరిగేందుకు అవకాశం ఉన్నా కూడా గది నుంచి బయటకు రావడం లేదని చెబుతున్నారు. ఇక శుక్రవారం సంజనాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాది ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.