48 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా శిల్పా శెట్టి.. చూశారంటే కళ్లు తిప్పుకోలేరంతే!
తెలుగు వారికి సాగర కన్య అనగానే గుర్తుకు వచ్చే భామ... శిల్పా శెట్టి. ఈ భామ తెలుగు వారికి సాగర కన్యగా పరిచయం అయింది. అదేనండి.. వెంకటేష్ హీరోగా నటించిన సాగరకన్య.. సాహస వీరుడు చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటించి తెలుగు వారికి పరిచయం అయింది. అయితే ఈ భామకు ఇప్పుడు 48ఏళ్లు. అయినా పాతికేళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది. అదేలా సాధ్యం అంటే దానికో సీక్రెట్ ఉందని తెలుస్తోంది. ఆ విరవాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంగుళురు భామ శిల్పాశెట్టి... బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఈ బ్యూటీది బాలీవుడ్ అయినప్పటికీ.. తెలుగులో తీసింది కొన్ని సినిమాలు ఆమెకు తెలుగువారికి దగ్గర చేశాయి. తెలుగులో ఈ భామకు వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహన వీరుడు సాగర కన్య చిత్రంతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో సాగర కన్యగా శిల్పా శెట్టి నటించి.. నిజంగా సాగర కన్య ఉంటే ఇలాగే ఉంటుందేమో అనేలా నటించింది.

తెలుగు వారికి సాగరకన్యగా పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మోహన్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటించింది. మోహన్ బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వీడెవడండీ బాబు మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో శిల్పా శెట్టి.. మోహన్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చివరగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన 'భలే వాడివి బాసూ' చిత్రంలో హీరోయిన్ గా నటించింది శిల్పా శెట్టి.

భలేవాడివి బాసూ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరీ దారణంగా బోల్తా కొట్టింది. ఇలా తెలుగులో శిల్పా శెట్టి... మూడు చిత్రాల్లో నటించింది. కానీ ఈ భామకు గుర్తింపు తెచ్చింది మాత్రం సాగర కన్య, సాహన వీరుడు మూవీ. ఇక శిల్పాశెట్టిని గమనిస్తే.. నిజంగా ఆమె శరీర సౌష్టవాన్ని ఎవరో శిల్పి చెక్కినట్లుగానే అనిపిస్తుంది. ఈ భామ 48 ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మకపోచ్చు. పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది.

శిల్పా శెట్టి ఆమె తన బాడీ మెయిన్ టెయిన్ చేస్తూ.. వస్తుంది. ఇక రోజు రోజుకూ శిల్పా శెట్టి వయసు తగ్గుతుందా అనే డౌట్ కలుగుతుంది నెటిజన్లకు. ఇప్పటికీ యోగాలసనాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది ఈ భామ. ఆమె అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ.. తన సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలను పంచుకుంటుంది. అయితే ఈ భామ ఫోటోలను చూసిన చాలా మంది ఈమెకు వయసు పెరుగుతుందా తగ్గుతుందా అని కామెంట్స్ పెడుతుంటారు.
తాజాగా ఈ భామ.. టైట్ ఫిట్ ఔట్ ఫిట్లో దర్శనం ఇచ్చింది. పర్ ఫెక్ట్ బాడీ షేపులతో రెచ్చగొట్టింది. ఈ వయసులో కూడా అస్సలు తరగని అందాలు. ఇవి చూసిన నెటిజన్స్... కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ భామ అందాలకు ఫిదా అయిపోయి.. ఆమె ఫోటోలను ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం శిల్పా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











