Shivani Rajashekar: నాకు పెళ్లంటే చాలా ఇష్టం.. ఎప్పుడు చేసుకుంటానంటే?
శివానీ రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటి జీవితా రాజశేఖర్, హీరో రాజేశేఖర్ ల ముద్దుల కూతురు అయిన ఈమె 2018లో 2 స్టేట్స్ సినిమా ద్వారా సినీ రంగంలో కాలు మోపింది. ప్రస్తుతం 29 ఏళ్ల వయసు కల్గిన ఈమె తాజాగా ఓ క్రేజీ మూవీలో నటించింది. ఆ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల అయింది. ఆ సందర్భంగానే ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ... షాకింగ్ కామెంట్లు చేసింది. పెళ్లి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో కూడా వివరించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
1996లో పుట్టిన శివానీ రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో 2018లో 2 స్టేట్స్ సినిమా చేసింది. అలా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె అదే ఏడాది వీవీ స్టూడియోసే అనే తమిళ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత అద్భతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, అన్బరివు, నెంజిక్కు నీతు, శేఖర్, కోట బొమ్మాళి పీఎస్ అనే సినిమాల్లోనూ కనిపించి అందిరనీ మెస్మరైజే చేసింది. ఇవి మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించిందీ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా తన తండ్రి, హీరో రాజశేఖర్ కథానాయకుడిగా చేసిన ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలను నిర్మించింది. ఇలా నటిగా, నిర్మాతగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె ఎంబీబీఎస్ కూడా పూర్తి చేయడం గమనార్హం. అయితే తాజాగా ఈమె విద్య వాసుల అహం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదల తేదీ సందర్భంగా నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడే అనేక విషయాలు చెప్పింది. తనకు పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని వివరించింది. గతంలో పెళ్లంటే తనకు ఇష్టం లేదని చెప్పిన ఈమె భిన్నమైన సమాధానం చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా తనకు పెళ్లి అంటే చాలా ఇష్టం అని శివానీ రాజశేఖర్ వెల్లడించింది. తన తల్లి జీవితా రాజశేఖర్ లాగా.. కుటుంబ బాధ్యతలు నిర్వహించాలని, ఒక మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని కోరికగా ఉంటుందని మనసులోని మాట చెప్పింది. అయితే తనకు అప్పుడే చేసుకోవాలని, ఇప్పుడే చేసుకోవాలనే నిబంధనలు ఏమీ లేవని.. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు తన పెళ్లి జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











