Sobhita Dhulipala: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత కొత్త సినిమా .. ఎక్కడ చూడొచ్చంటే?
Shobhita Dhulapati: ఓటీటీల హవా రోజురోజుకు పెరుగుతోంది. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాలు, వెబ్ సిరీసులు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వీక్షకులకు విభిన్న కంటెంట్ అందిస్తోంది. అలాగే ఎప్పుడైనా, ఎక్కడైనా కంటెంట్ చూసే వెసులుబాటు ఉండటంతో అందరూ తెగబడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు డైరెక్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నటించిన మూవీ నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానున్నది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నదో ? మీరు కూడా ఓ లూక్కేయండి.
హాట్ బ్యూటీ, హీరోయిన్ శోభితా ధూళపాటి నటించిన మూవీ 'లవ్ సితార'. ఈ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ త్వరలో విడుదల కానున్నది. అయితే.. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. అది కూడా జీ5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ రొమాంటిక్ మూవీలో శోభితా సరసన హీరో రాజీవ్ సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు కానున్నది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (సెప్టెంబర్ 10) అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో పాటే స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.

ఇక పాన్ ఇండియా హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సౌత్ లోనే కాదు.. నార్త్ లోనూ వరుసగా సినిమాలు,వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కథతో పాటు గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడు. అవకాశం దొరికితే రెచ్చిపోతుంది ఈ గ్లామర్ బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ పాన్ ఇండియా లెవల్ లో బాగా ఫేమస్ అయిపోయింది.

శోభితా ధూళిపాళ్ల పర్సనల్ లైఫ్ గురించి వస్తే.. త్వరలో ఈ బ్యూటీ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పి పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ సొగసరి టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతుంది. వీరి నిశ్చితార్థం ఆగస్టు 08న జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నిశ్చితార్థం అయినా తరువాత శోభితా పేరు నెట్టింట్లో మారుమోగుతోంది. మరో నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే


Click it and Unblock the Notifications











