Shraddha Das: చీరకట్టులో 'శ్రద్ధ'గా​ అందాల ఆరబోత.. ఇలా కూడా చూపించొచ్చా!

అల్లు అర్జున్​ ఆర్య 2 సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది మోస్ట్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి నరేష్​ సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం మూవీతో పరిచయమైంది. తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్​వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. కానీ హాట్​ అండ్​ బ్యూటిఫుల్​ ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్​. మరోసారి తన సొగసైన అందచందాలతో చీరకట్టులో గ్లామర్​ క్వీన్​ అనిపించుకున్న శ్రద్ధా దాస్​ అందాలు 'శ్రద్ధ'గా చూసేద్దామా!

పాత్రికేయ రంగంలో డిగ్రీ..

పాత్రికేయ రంగంలో డిగ్రీ..

1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

అంతగా రాని పేరు..

అంతగా రాని పేరు..

2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించింది. సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు.

శాంతి పాత్రలో..

శాంతి పాత్రలో..

తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది.

 40 సినిమాల్లో..

40 సినిమాల్లో..

అనంతరం డార్లింగ్, నాగవల్లి, మరో చరిత్ర, ముగ్గురు, మొగుడు, రేయ్​, డిక్టేటర్​, గుంటూర్ టాకీస్, పీఎస్​వీ గరుడ వేగ, ఏక్​ మినీ కథ వంటి తదితర చిత్రాలలో నటించింది. మొత్తంగా తెలుగు, తమిళ్, పిందీ భాషల్లో కలిపి సుమారు 40 సినిమాల్లో నటించి తన గ్లామరేంటో చూపించింది.

సోషల్​ మీడియాలో హవా..

సోషల్​ మీడియాలో హవా..

అయినా అనుకున్నంత మంచి హిట్​ ఇప్పటివరకు శ్రద్ధా దాస్​కు పడలేదు. దీంతో సోషల్​ మీడియాను నమ్ముకున్న ఈ ముంబై బ్యూటీ తరచు ఫొటోషూట్​లతో ప్రేక్షకులను, అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రద్ధా దాస్​ హవా నడుస్తోంది.

అర్థం సినిమాతో..

అర్థం సినిమాతో..

సినిమాల పరంగా స్టార్ స్టేటస్​ పొందకపోయిన తన గ్లామర్ ఫొటోలతో యూత్​ను అట్రాక్ట్​ చేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. శ్రద్ధ దాస్ సోయగాలను చూసిన నెటిజన్లు ఆమెకు ఫ్యాన్స్​ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రద్ధా దాస్​ అర్థం సినిమాతో తన లక్​ను పరీక్షించుకోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X