శ్రీయ సరన్ అందాల ఆరబోత: టూ పీస్ బికినీలో దారుణంగా.. !

గతంలో మాదిరిగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకున్నా.. ఎంతో మంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తున్నారు. నిరంతరం ఫ్యాన్స్ టచ్‌లో ఉంటూ ఫొటోలు, వీడియోలతో అందాల విందు చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఒకరు. చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపించిన ఈమె.. వివాహం తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బికినీలో రెచ్చిపోతూ తీసుకున్న సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

టాలీవుడ్‌లో హవాను చూపించిన శ్రీయ

టాలీవుడ్‌లో హవాను చూపించిన శ్రీయ

'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీయ శరణ్.. ఆ వెంటనే బోలెడు అవకాశాలను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే ఏడాది పది చిత్రాల్లో నటించి సత్తా చాటింది. అదే సమయంలో సీనియర్లు, జూనియర్లతోనూ ఆడిపాడింది. ఇలా దాదాపు పదేళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా వెళుతూ హవాను చూపించింది.

అన్ని భాషల్లోనూ సత్తా.. వరుస ఆఫర్లు

అన్ని భాషల్లోనూ సత్తా.. వరుస ఆఫర్లు

తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీయ శరణ్.. ఆ తర్వాత హిందీ చిత్రాల్లోనూ నటించింది. అంతేకాదు.. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించింది. ఆమె ఎక్కడ సినిమాలు చేసిందో అక్కడ చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సాగిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుందీ బ్యూటీ.

వివాహం తర్వాత భర్తతో కలిసి హల్‌చల్

వివాహం తర్వాత భర్తతో కలిసి హల్‌చల్

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శ్రీయ విదేశీయుడు ఆండ్రూతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2018లో అతడిని వివాహం చేసుకుందామె. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

ప్రతిష్టాత్మక చిత్రం.. వరుస సినిమాలతో

ప్రతిష్టాత్మక చిత్రం.. వరుస సినిమాలతో

గతంలో ఏడాదికి పది సినిమాల వరకూ చేసిన శ్రీయ శరణ్.. వివాహం తర్వాత వేగం తగ్గించేసింది. దీంతో కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో కీలక పాత్రను పోషించిన ఆమె.. ఇప్పటికే ఆ షూట్‌ను పూర్తి చేసుకుంది. దీనితో పాటు 'గమణం', 'నారగసూరన్', 'తడ్కా' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ షూట్ కంప్లీట్ అయ్యాయి.

అందులో ఫుల్ బిజీగా ఉంటూ సందడి

అందులో ఫుల్ బిజీగా ఉంటూ సందడి

కొంత కాలంగా సోషల్ మీడియాలో శ్రీయ శరణ్ ఎంత యాక్టివ్‌గా ఉంటోంది. సినిమాల్లో నటించకపోయినా దీని ద్వారానా ఈ అమ్మడు ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వాళ్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతూ దూసుకుపోతోందామె.

అరాచకంగా శ్రీయ ట్రీట్.. బికినీలో రచ్చ

అరాచకంగా శ్రీయ ట్రీట్.. బికినీలో రచ్చ

ప్రస్తుతం భర్త ఆండ్రీతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోన్న శ్రీయ శరణ్.. తాజాగా అతడితో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె పింక్ కలర్ బికినీని ధరించింది. భర్తతో కలిసి సరసాలు ఆడుతూ అందులో ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తోంది. దీంతో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X