బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించే నటనతో.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో కొంత కాలంగా సినీ ప్రియులను ఫిదా చేస్తోన్న బ్యూటీ శృతి హాసన్. దిగ్గజ నటుడు విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్ల ఒక్కొక్కటిగా బయట పెడుతూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందామె. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో సరసాలు ఆడుకుంటూ తీసుకున్న వీడియోను శృతి హాసన్ షేర్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

అన్నింట్లోనూ ముందే.. ఫుల్ పాపులర్

అన్నింట్లోనూ ముందే.. ఫుల్ పాపులర్

హీరోయిన్‌గా పరిచయమైనా.. ఎన్నో విద్యలను చూపిస్తూ అనతి కాలంలోనే ఫేమస్ అయింది శృతి హాసన్. హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్ అన్న పేరును తెచ్చుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

అలా పరిచయం.. తెలుగులోకి ఎంట్రీ

అలా పరిచయం.. తెలుగులోకి ఎంట్రీ

చాలా చిన్న వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది శృతి హాసన్. అలాగే సొంతం కొన్ని ఆల్బమ్‌లను కూడా కంపోజ్ చేసింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో తెలుగులోకి ప్రవేశించింది.

స్టార్ హీరోయిన్‌.. రీఎంట్రీలో దూకుడు

స్టార్ హీరోయిన్‌.. రీఎంట్రీలో దూకుడు


మన స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది శృతి హాసన్. కెరీర్ పరంగా బిజీగా ఉన్న టైంలోనే చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకుంది. ఈ క్రమంలోనే రీఎంట్రీ ఇచ్చి 'క్రాక్', 'వకీల్ సాబ్'తో సక్సెస్‌ను అందుకుంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్‌తో 'సలార్‌' అనే మూవీ చేస్తోంది.

ఒకరితో బ్రేకప్.. ఇప్పుడు అతడితో లవ్

ఒకరితో బ్రేకప్.. ఇప్పుడు అతడితో లవ్

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ మరొకరితో లవ్ ట్రాక్ నడపడం కూడా మొదలెట్టింది. ఇప్పుడతడితో రచ్చ రచ్చ చేస్తోంది.

పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు

పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు


వాస్తవానికి బ్రేకప్ తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ హైలైట్ అవుతున్నారు.

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
రొమాన్స్ చేస్తున్న వీడియోను వదిలి

రొమాన్స్ చేస్తున్న వీడియోను వదిలి


తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోన్న శృతి హాసన్.. తరచూ ఫొటోనో, వీడియోనో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బెడ్‌రూంలో అతడి మీద కాళ్లు పెట్టి పడుకున్న వీడియోను షేర్ చేసింది. నైట్ టైమ్‌లో తీసిన ఈ వీడియో ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకుంది. ఇందులో వాళ్లతో పాటు మరొకరు కూడా ఉన్నారు. అయినా.. గిల్లికజ్జాలు ఆడుకుంటూ వీళ్లు తెగ సందడి చేసేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X