నా భర్త మరో హీరోయిన్‌ను ప్రేమించాడు - హీరోయిన్ స్నేహ
హీరోయిన్ స్నేహ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ స్నేహను తమ కలల దేవతగానే చూస్తారు. రవితేజ, వెంకటేష్ , శ్రీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్నేహ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.
తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో నటించారు స్నేహ. కెరీర్ పీక్ టైంలో ఉండగానే తమిళ నటుడు ప్రసన్నను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది.పెళ్లి తరువాత కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఇక స్నేహ ఇటీవలే వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. చైన్నైలో ఆమె చీరల బిజినెస్ స్టార్ట్ చేశారు. నటిగా తనకున్న క్రేజ్‌ను బిజినెస్ పరంగా వినియోగించుకుంటున్నారామె.

ఇదిలా ఉంటే స్నేహ తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో నమ్మకం, అపనమ్మకం, ప్రేమ, అప్యాయతల గురించి స్నేహ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితంలో పొజెసివ్‌గా ఉండాలి కానీ అది అతిగా ఉండకూడదని ఆమె చెప్పుకొచ్చారు.అది ఎక్కువైతే నమ్మకాన్ని కోల్పోతాం. బయటకు ఎందుకు వెళ్తున్నావ్? వెళ్లి ఏం చేస్తావ్? వంటి ప్రశ్నలు తలెత్తకూడదు.
అవతలి వాళ్లు సరిగ్గా అర్దం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు. ఒకరు మనల్ని అడిగేముందు నేను ఫలానా చోటుకు వెళ్తున్నానని ఈ సమయంలోపు వచ్చేస్తానని సమాచారం ఇవ్వాలని ఆమె తెలిపారు. ఇక పెళ్లైన కొత్తలో నేను కూడా పొజెసివ్‌గా ఉండేదాన్నని అలా అని నా భర్తపై నమ్మకం లేక కాదని కాదని స్నేహ పేర్కొన్నారు. నాకంటే ముందు ఓ అమ్మాయిని ప్రసన్న ప్రేమించాడు. వారికి బ్రేకప్ అయింది.
తన భర్త లవ్‌స్టోరీ వల్ల నాకెలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే ఆ బ్రేకప్ జరిగింది కాబట్టే ప్రసన్న నాకు భర్త అయ్యాడని స్నేహ తెలిపారు. ప్రసన్న విషయంలో నేను చాలా లక్కీ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న తరుణంలో స్నేహ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











