‘నా ఫ్లాట్‌లో నాతో సల్మాన్ ఖాన్ రొమాన్స్.. కాబోయే భార్య చేతికి రెండ్ హ్యాండెడ్‌గా దొరికాం’
ఇండియన్ సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరోల్లో ప్రధానంగా వినిపించే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండల వీరుడికి 60 ఏళ్లు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. సల్మాన్ జీవితంలో అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు కోకొల్లలు. అయితే ఇప్పటికే సల్మాన్ యంగ్ హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్టు తరచుగా వార్తలు మీడియాలో వస్తునే ఉంటాయి. అయితే సల్మాన్‌కు పెళ్లి కాకపోవడానికి, తనతో ఉన్న అఫైర్ ఎలా కారణమైందనే విషయాన్ని బాలీవుడ్ నటి సోమి ఆలీ వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే?
సల్మాన్ డేటింగ్, అఫైర్ గురించిని విషయాల్లోకి వెళితే.. తన తొలి ప్రేమాయణం మోడల్, బాలీవుడ్ హీరోయిన్ సంగీత బిజ్లానీతో మొదలుపెట్టారు. దాదాపు వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనే సమయంలో బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్, సోమి ఆలీ, కత్రినా కైఫ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ లాంటి పేర్లు ఆయనతో ముడిపెట్టారు. ఇప్పటికే ఆయనతో కుర్ర హీరోయిన్ల పేరు ముడిపెడుతూనే ఉంటారు.

సంగీత బిజ్లానీ, ఐశ్వర్య రాయ్‌తో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సోమి ఆలీతో అఫైర్‌ను సల్మాన్ కొనసాగించారు. వారిద్దరూ పీకల్లోతు రొమాన్స్‌లో మునిగిపోయారు. సోమి ఆలీకి చాలా దగ్గరయ్యాడు. 1991 నుంచి 1999 వరకు వారిద్దరి అఫైర్ కొనసాగింది. అయితే కొన్ని కారణాల వల్ల సోమీ ఆలీతో బ్రేకప్ కావడం జరిగింది. సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత దేశం విడిచి బ్రిటన్‌లో ఆమె స్థిరపడింది. అయితే ఇటీవల కాలంలో మీడియాలోను, సోషల్ మీడియాలోను సల్మాన్‌పై సోమీ ఆలీ విరుచుకుపడటం సంచలనంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
సంగీత బిజ్లానీతోపాటు నాతో ఒకేసారి అఫైర్ కొనసాగించాడు. సంగీతాను పబ్లిక్‌గా కొట్టేవాడు. చాలా సార్లు ఆమెను కొట్టాడు. నన్ను కూడా సల్మాన్ కొట్టాడు. నన్ను కొట్టి ఓ మాట చెప్పాడు. నీవంటే నాకు ఇష్టం కాబట్టి కొడుతున్నాను. నా పక్కింటి వాళ్లను ఎందుకు కొట్టడం లేదో నువ్వే ఊహించుకో అని సల్మాన్ ఖాన్ చెప్పేవాడని సోమీ ఆలీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సంగీత బిజ్లానీతో సల్మాన్ పెళ్లి నిర్ణయమైపోయింది. వారిద్దరి పెళ్లికి వెడ్డింగ్ కార్డుకు కూడా ప్రింట్ అయ్యాయి. ఆ సమయంలో నా ఫ్లాట్‌లో సల్మాన్ నాతో రొమాన్స్ చేస్తుండగా సంగీత అక్కడికి వచ్చింది. నా ఫ్లాట్ తలుపు కొట్టి లోపలికి వచ్చింది. ఆ సమయంలో నాతో సల్మాన్ ఉండటాన్ని చూసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నది అని సోమీ ఆలీ ఇంటర్వ్యూలో ఆ రోజు సంఘటనను పూస గుచ్చినట్టు చెప్పింది.
సోమీ ఆలీ కెరీర్ విషయానికి వస్తే.. సంజయ్ దత్, సైఫ్ ఆలీ ఖాన్, మిథున్, గోవిందా లాంటి అగ్ర హీరోలతో నటించింది. కిషన్ అవతార్, ఆంత్, యార్ గద్దార్, తీస్రా కౌన్? ఆవో ప్యార్ కరె, ఆందోళన్, మాఫియా, చుప్ సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











