బికినీతో రెచ్చిపోయిన బాలయ్య హీరోయిన్: అదిరిన గ్లామర్ ట్రీట్.. హట్‌నెస్ తట్టుకోవడం కష్టమే

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అందంతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్న హీరోయిన్లలో సోనాల్ చౌహాన్ ఒకరు. మిస్ ఇండియాగా ఎంపికైన ఈ బ్యూటీ.. సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఇక్కడ కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేసినా.. తన అందచందాలతో అదరగొట్టేసింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా బికినీతో రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. మిస్ ఇండియా విన్నర్

అలా ఎంట్రీ.. మిస్ ఇండియా విన్నర్

చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది బోల్డ్ బ్యూటీ సోనాల్ చౌహాన్. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. మంచి గుర్తింపును అందుకుంది. ఆ సమయంలో ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఫలితంగా కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా మారిపోయింది.

హిందీ మూవీతో హీరోయిన్‌ అయింది

హిందీ మూవీతో హీరోయిన్‌ అయింది

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరపించిన సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. ఈ నేపథ్యంలో 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే మంచి పాత్రను పోషించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయింది.

తెలుగులోకి పరిచయం.. అన్నీ అలా

తెలుగులోకి పరిచయం.. అన్నీ అలా

హీరోయిన్‌గా పరిచయం అయిన ఏడాదే సోనాల్ చౌహాన్ 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. దీంతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సినిమాల మీద సినిమాలు చేసింది.

బాలయ్యతో హ్యాట్రిక్ చేసేసిన సోనాల్

బాలయ్యతో హ్యాట్రిక్ చేసేసిన సోనాల్

సోనాల్ చౌహాన్ తెలుగులో ఏడు సినిమాల వరకూ చేసింది. 'రెయిన్‌బో' నుంచి మొదలుకొని 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది. అందులో మూడు నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె అందాల ఆరబోసింది. తద్వారా టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గానే పేరును తెచ్చుకుంది.

మల్టీస్టారర్‌లో స్పెషల్ సాంగ్‌కు సిద్ధం

మల్టీస్టారర్‌లో స్పెషల్ సాంగ్‌కు సిద్ధం

సోనాల్ చౌహాన్ గతంలో మాదిరిగా వరసగా సినిమాలు చేయడం లేదు. అరకొరగానే అవకాశాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ బ్యూటీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న 'F3'లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ సేపు మాత్రమే ఈ పాత్ర ఉంటుందట. అంతేకాదు, ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుందని టాక్.

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నా.. సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోవర్లను సంఖ్యను రోజు రోజుకూ పెంచుకుంటోందామె.

బికినీతో రెచ్చిపోయిన బోల్డు బ్యూటీ

బికినీతో రెచ్చిపోయిన బోల్డు బ్యూటీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి కనిపించింది. తద్వారా ఆమె అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. సముద్రపు అలల మధ్య గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X