For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  |

  సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లంతా సినిమాల్లో నటిస్తేనే ప్రేక్షకులకు గుర్తుంటారు. అయితే, ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం మూవీలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు వాళ్లంతా నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. దాని ద్వారానే తమ అప్‌డేట్లను ఇవ్వడంతో పాటు అందాల విందు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఒకరు. టాలీవుడ్ పలు చిత్రాలు చేసి గ్లామరస్ హీరోయిన్‌గా పేరొందిన ఈ బ్యూటీ.. ఫాలోయింగ్‌ను కూడా భారీగానే దక్కించుకుంది. తద్వారా అప్పుడప్పుడూ ఆఫర్లను కూడా అందుకుంటోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వదిలింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  అప్పుడే అందంతో మాయ చేసిన సోనాల్

  అప్పుడే అందంతో మాయ చేసిన సోనాల్

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఉండే సోనాల్ చౌహాన్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ అదరగొట్టేసింది. ఆ సమయంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయి తన హవాను చూపించింది.

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్

  అలా పరిచయం.. ఫస్ట్ మూవీతోనే బాగా

  అలా పరిచయం.. ఫస్ట్ మూవీతోనే బాగా

  మోడలింగ్ రంగంలో తన మార్క్ గ్లామర్‌తో మైమరపించిన సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకున్న చాలా కాలం తర్వాత ‘జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. మొదటి చిత్రంలోనే మంచి పాత్రను పోషించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో మొదటి చిత్రంతలోనే పాపులర్ అయింది. ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా ఆచితూచి వ్యవహరించింది.

  టాలీవుడ్‌లోకి ఎంట్రీ... అక్కడ ఫుల్ బిజీ

  టాలీవుడ్‌లోకి ఎంట్రీ... అక్కడ ఫుల్ బిజీ

  బాలీవుడ్ ‘జన్నత్' అనే సినిమాను చేసిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో మిగిలిన భాషలను కాదని.. ‘రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆయా భాషల్లో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఫలితంగా సోనాల్ చౌహాన్ ఎక్కువగా అక్కడే నటిస్తూ వచ్చింది.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  బాలయ్యతోనే ఎక్కువ సినిమాలు చేసింది

  బాలయ్యతోనే ఎక్కువ సినిమాలు చేసింది

  సుదీర్ఘమైన ప్రయాణంలో సోనాల్ చౌహాన్ తెలుగులో మొత్తం ఏడు సినిమాల వరకూ చేసింది. ‘రెయిన్‌బో' నుంచి మొదలుకొని ‘లెజెండ్', ‘పండగ చేస్కో', ‘షేర్', ‘సైజ్ జీరో', ‘డిక్టేటర్', ‘రూలర్' వంటి సినిమాల్లో నటించింది. అందులో మూడు నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె అందాల ఆరబోసింది. తద్వారా టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గానే గుర్తింపును తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు ఓ సినిమా స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుందని కొద్ది రోజులుగా ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

  అందులో మాత్రం ఎప్పుడూ రచ్చ చేస్తోంది

  అందులో మాత్రం ఎప్పుడూ రచ్చ చేస్తోంది

  చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

  ఎక్కువగా అలాంటివే వదులుతోన్న భామ

  ఎక్కువగా అలాంటివే వదులుతోన్న భామ

  మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే సోనాల్ చౌహాన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ సోనాల్ చౌహాన్ హాట్ టాపిక్ అవుతోంది.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  Gagana Veedhi Movie Launch Event Held In Hyderabad | Filmibeat Telugu
  అదిరిపోయే డ్రెస్‌లో అందాల విందు చేస్తూ

  అదిరిపోయే డ్రెస్‌లో అందాల విందు చేస్తూ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేసే గ్లామరస్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ లోదుస్తులతో ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ చేస్తోన్న ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. తద్వారా ఇది ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood actress and a former model Sonal Chauhan Full Active In Social Media. Now She Shared a Hot Photo in her Instagram. This Photo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X