twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!

    |

    మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అక్కడ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా తెరంగేట్రం చేశారు. ఇప్పటికీ ఎంతో మంది ఆ బాటలోనే పయనిస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో గుర్తింపును అందుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు.

    అందులో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించిన ఈ భామ.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా వరుస సినిమాలతో హవా చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ కపూర్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

    అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

    అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

    బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సోనమ్ కపూర్. హీరోయిన్ అవ్వడానికి ముందే ఎన్నో విభాగాల్లో పలు రకాల శిక్షణలు తీసుకుంది. ఆరంభంలో ఎన్నో కథలను రిజెక్ట్ చేసిన ఈ భామ.. 'సవారియా' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

    ఇందులో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చూపించి మెస్మరైజ్ చేసింది. తద్వారా ఆరంభంలోనే మంచి పేరుతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగానే అందుకుంది.

    హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజుహాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు

    వాటితో గుర్తింపు... స్టార్‌గా ఎదిగింది

    వాటితో గుర్తింపు... స్టార్‌గా ఎదిగింది

    తన కెరీర్‌లో సోనమ్ కపూర్ చేసిన చిత్రాలు చాలా తక్కువే. కానీ, వాటిలో గొప్ప నటనను కనబరిచిన ఈ బ్యూటీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. తద్వారా తక్కువ సమయంలోనే మరెవరికీ సాధ్యం కాని రితిలో సత్తా చాటింది. మరీ ముఖ్యంగా 'నీర్జా' మూవీ సోనమ్ కపూర్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది.

    అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. దీనితో పాటు 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో మెస్మరైజింగ్ యాక్టింగ్ చేసింది.

    ప్రేమ వివాహం.. కెరీర్‌ను ఆపలేదు

    ప్రేమ వివాహం.. కెరీర్‌ను ఆపలేదు

    కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ లోకం అంతా వచ్చింది. ఆనంద్‌తో వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది ఈ స్టార్ హీరోయిన్.

    గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అయితే, అంతకు ముందులా కాకుండా తన పాత్రలను బట్టి సినిమాలను ఒప్పుకుంటోంది. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశగానే ఉంటున్నారు.

    హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్హాట్ హాట్ వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: బ్రాతో అలా చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్

    సోనమ్‌పై విమర్శలు.. పట్టించుకోలే

    సోనమ్‌పై విమర్శలు.. పట్టించుకోలే

    అనిల్ కపూర్ కూతురు కావడంతో సోనమ్ కపూర్‌పై అభిమానుల నుంచి ఎన్నో రకాల ఒత్తిడులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె సినిమాల్లో కనిపించే తీరు.. సోషల్ మీడియాలో పెడుతోన్న ఫొటోలు, వీడియోలపై అభిమానులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

    మరీ ముఖ్యంగా సోనమ్ కపూర్ వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటోంది.

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

    అప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నా హీరోయిన్ సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.

    అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే సోనమ్ కపూర్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య ఇప్పటికీ గణనీయంగా పెరుగుతూనే ఉంటోంది.

    డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక మందన్నా: దానికి వయసుతో పని లేదు.. అతడిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ!డేటింగ్‌పై ఓపెన్ అయిన రష్మిక మందన్నా: దానికి వయసుతో పని లేదు.. అతడిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ!

    ఎక్కువగా అలాంటివి షేర్ చేస్తోంది

    ఎక్కువగా అలాంటివి షేర్ చేస్తోంది

    సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోదన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనమ్ షేర్ చేస్తుంటుంది.

    తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ సోనమ్ కపూర్ హైలైట్ అవుతూనే ఉంది. అదే సమయంలో విమర్శలనూ ఎదుర్కొంటోంది.

    Recommended Video

    Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
    హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన సోనమ్

    హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన సోనమ్

    సోనమ్ కపూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో డిజైనర్ డ్రెస్ వేసుకుని కనిపించింది. అయితే కొన్నింటిలో మాత్రం జాకెట్ విప్పేసి కేవలం బ్రాతో మాత్రమే ఫోజులిచ్చింది. ఇందులో ఆమె లోదుస్తుల నుంచి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, మిగిలిన ఫొటోల్లో కూడా అమ్మడి అందాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇంకేముంది.. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో సోనమ్ కపూర్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

    English summary
    Bollywood Actress Sonam Kapoor Ahuja is Vary Busy In Social Media. Now She Shared her Sizzling Photos in Instagram. This is Gone Viral in Internet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X