కమల్ మూవీని మిస్ చేసుకొన్న సౌందర్య.. ఆ రోల్ దక్కించుకొన్న హీరోయిన్ ఎవరు? కారణం అదేనా?

సినిమా పరిశ్రమలో అనుకొన్నవన్నీ జరగకుండా.. అనుకోనివి జరుగుతుంటాయి. ముందుగా ఓ హీరో, హీరోయిన్ అనుకొంటారు. తీరా చూస్తే వాళ్లు కాకుండా వేరే వాళ్ల ప్రాజెక్టులోకి వస్తారు. అందుకు చాలా కారణాలు ఉంటాయి. అయితే సౌందర్యను ఓ సినిమా అనుకొని ఆ తర్వాత మరో హీరోయిన్‌ను తీసుకొన్నారు. అయితే ఆ సినిమా కళాతపస్వి విశ్వనాథ్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రావడం, ఆమె హీరోయిన్ పాత్రను మిస్ చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ సినిమా పేరు ఏంటి? సౌందర్య స్థానంలో వచ్చిన హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

పాగర సంగమం, స్వాతిముత్యం సినిమాల తర్వాత విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్‌కు ఎంత క్రేజ్ ఉంటున్నదనేది మాటల్లో చెప్పలేని విషయం. అలాంటి సమయంలో వారిద్దరూ కలిసి సినిమా చేయడానికి సిద్దమయ్యారు. దాంతో చాలా మంది హీరోయిన్లు ఆ సినిమాలో నటించేందుకు ప్రయత్నించారట. కానీ తనకు కావాల్సిన హీరోయిన్ విషయంలో విశ్వనాథ్‌కు కొన్ని నియమాలు, నిబంధలు ఉంటాయనేది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే..

Heroine Soudarya missed Kamal Haasan and K Vishwanth s Shubha Sankalpam Here is reason behind loss

టాలెంట్, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అంతకుముందు తన సినిమాల్లో నటించిన వారు ఉండకూడదనే కండిషన్‌తో హీరోయిన్ ఎంపిక ప్రారంభించారు. అయితే ఆ సినిమాలో చివరకు సౌందర్యను ఎంపిక చేశారు. కమల్ హాసన్ సరసన నటించే అవకాశం, అలాగే విశ్వనాథ్ లాంటి లెజెండ్‌ సినిమాలో చేసే ఛాన్స్ రావడంతో సౌందర్య కూడా తనకు ప్రమోషన్ వచ్చినంత ఫీలైంది.

అయితే తీరా సెట్స్ మీదకు వెళ్లే సమయానికి హీరోయిన్ మారిపోయింది. సౌందర్య స్థానంలో మరో హీరోయిన్‌ను రిప్లే చేశారు. అయితే సౌందర్య ఆ సినిమాను మిస్ చేసుకోవడం వెనుక రకరకాల విషయాలు వినిపించినప్పటికీ.. వాస్తవానికి ఆ సమయంలో సౌందర్య తన డేట్స్‌ను అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్లే ఆమెను తప్పించి మరో తారను తెరపైకి తీసుకొచ్చారు.

Heroine Soudarya missed Kamal Haasan and K Vishwanth s Shubha Sankalpam Here is reason behind loss
ఇక కమల్ సరసన, విశ్వానాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకొన్న అందాల భామ ప్రియారామన్. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగులో మంచి ఆఫర్లు రావడానికి కూడా కారణమైంది. అలాంటి పాత్ర సౌందర్య చేసి ఉంటే.. ఆ రోల్‌కు మరింత ప్రాణం పోసేదనే అభిప్రాయం ఇప్పటికీ సినీ వర్గాల్లో వినిపిస్తుంటుంది.

మనం తినే ప్రతీ గింజ మీద మన పేరు రాసి ఉంటుందని సాధారణంగా సామెత వింటుంటాం. అదే విధంగా సినిమాలో చేసే ప్రతీ పాత్ర మీద కూడా నటించే వారి పేరు రాసి ఉంటుంది. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా.. ఆ పాత్ర సరైన వారిని వెతుక్కుంటూ వెళ్తుందనే మాట చెప్పుకొంటారు. ఏది ఏమైనా ప్రియా రామన్‌కు అదృష్టం అలా దక్కితే.. సౌందర్యకు మాత్రం అలా దురదృష్టం వెంటాడింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం మళ్లీ ఎప్పుడు ఆమె తలుపు తట్టకకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X