Heroine Sreeleela: అనిల్ రావిపూడికి శ్రీలీల కోడలవుతుందా.. అక్క కూతురుతోనే సినిమా తీశాడా?
Heroine Sreeleela: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అగ్ర హీరోల అందరి సరసన ఛాన్సులు కొట్టేస్తూ.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన అందం, అభినయంతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరి చేత ఆహా అనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే మాటకు చెక్ పెడుతూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ.. ఓ వైపు కుర్ర హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు సీనియర్ హీరోల పక్కన కూడా నటిస్తోంది.
తాజాగా ఈ అందాల తార అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఇందులో శ్రీలీల.. బాలకృష్ణకు కుమార్తెగా కనిపించనుంది. ఇటీవలే విడుదల అయిన సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈక్రమంలో దర్శక,నిర్మాతలతో పాటు బాలయ్య బాబు, కాజల్ అగర్వాల్, శ్రీలీలలు వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. గ్రూపుగా, సింగిల్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ చెలరేగిపోతున్నారు. అయితే తాజాగా హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే.. అందరూ ఆశ్చర్యపడే కొన్ని విషయాలను తెలిపారు.

అనిల్ రావిపూడి.. శ్రీలీలను మొట్ట మొదటిసారిగా ఎక్కడ చూశాడో చెబుతూ.. వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని కూడా వెల్లడించాడు. స్టార్ హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్ షిప్ మొదటి సారిగా బయటపెట్టాడు. శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంత ఊరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని.. ఆ ఊరే తన అమ్మమ్మ గ్రామం అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. శ్రీలీల తల్లి స్వర్ణ.. తనకు వరుసకు సోదరి అవుతుందని.. ఆ లెక్కన శ్రీలీల కోడలు వరుస అవుతుందని పేర్కొన్నాడు.

అయితే ఈ విషయం శ్రీలీల, అనిల్ రావిపూడి ఇద్దరి మధ్యే ఉండదని.. సెట్లో ఎవరూ లేకపోతే శ్రీలీల తనను మామయ్య, మామయ్య అంటూ పిలిచేదని చెప్పారు. అందరి ముందు అనిల్ గారు, డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల ఎవరూ లేకపోతే తెగ ఆట పట్టించేదని నవ్వుతూ వివరించాడు. శ్రీలీల పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ఆమె పెరిగింది, చదువుకుంది అంతా బంగళూరు, అమెరికాలోనని.. కానీ ఆమె తన అమ్మమ్మ ఊరు అయిన పొంగులూరుకు ప్రతీ ఏటా రావడంతో తనకు తెలిసిందని అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు.

ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. కోడలు అవుతుంది కాబట్టే.. అక్క కూతురితో సినిమా తీశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాకే మీ బంధుత్వం బయట పెట్టారేంటి సార్... మీరే ఆమెతో మొదటి సినిమా చేస్తే బాగుండు కదా అంటూ మరికొంత మంది వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఓ బంధుత్వం ఉండే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు చాలా ఉపయోగపడతారంటూ శ్రీలీల ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











