Sreeleela: ప్రేమలో పడ్డ శ్రీలీల.. కమిటెడ్ అంటూ లైవ్‌లోనే ట్విస్ట్ ఇచ్చిందిగా!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రేమలో పడిందా... ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ భామ ప్రేమలో పడిపోయిందంట. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా తనే తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకువచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఇక అందులో నెటిజన్స్ వాళ్లకు నచ్చిన ప్రశ్నలు వేశారు. ఇక ఇందులో భాగంగా ఓ వ్యక్తి మీరు కమిటెడా అని అడిగితే యస్ అంటూ ఓ ట్విస్ట్ ఇచ్చింది ఈ భామ. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కన్నడ బ్యూటీ శ్రీలీల.. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత రవితేజతో కలిసి ధమాకా చిత్రం చేసింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక శ్రీలీల డ్యాన్స్, అందంతో ఈ సినిమాలో మరోసారి మెప్పించింది. ఈ సినిమాతో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇక బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన స్కంద చిత్రంలో నటించిన ఈ బ్యూటీ... ఈ సినమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇటీవల బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. బాలయ్య కూతురిగా ఈ భామ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ భామ ఆది కేశవ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగాంగా... బిగ్ బాస్ హౌస్ కు వెళ్లింది. అక్కడ వెళ్లి.. హౌస్ లోని వారితో సందడి చేసింది. అయితే శ్రీలీల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఈ భామ అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా చిట్ చాట్ నిర్వహించింది.

ఇక ఇందులో ఓ అభిమాని మీరు ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారా అని అడుగాడు. దానికి అవును అంటూ సమాధానం ఇచ్చింది బ్యూటీ. ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లినట్లు వివరించింది. ఇక మరో అభిమాని మీరు కమిటెడా అంటూ అడిగాడు. దానికి శ్రీలీల... అవును.. కమిటెడ్ అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో పాటు అతనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అవును నేను కమిటెడే అది కూడా నా పనికి అంటూ చెప్పి షాక్ ఇచ్చింది.

ఎందుకంటే కమిటెడే అనడంతోనే అందరూ ఆమె ప్రేమలో పడింది అనుకున్నారు. కానీ నా పనిలో నేను కమిటెడ్ అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం శ్రీ లీల చెప్పిన విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటునే.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది ఈ బ్యూటీ.


Click it and Unblock the Notifications











