Sreeleela: కాలమే కాటు వేసిందా... పాపం శ్రీలీల పరిస్థితి ఏంటి ఇలా తయారైంది?

సినీ పరిశ్రమలో ఎంతోమంది తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉంటారు. కానీ అందులో చాలా తక్కువ మందికి మాత్రమే స్టార్ అవకాశాలు దక్కుతాయి. ఈ మధ్యకాలంలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఎవరు అంటే కచ్చితంగా అందరూ చెప్పే పేరు శ్రీలీల. నిజానికి ఈమె తెలుగమ్మాయి కానీ ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారి పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ భామ వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతోంది. కానీ అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతానికి ఏకంగా మహేష్ బాబు, రామ్, నితిన్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ సహా అనేకమంది కుర్ర హీరోల పక్కన నటించడమే కాదు... బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోకి కూతురు పాత్రలో కూడా నటిస్తోంది. అయితే అవకాశం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందాన ఎలాంటి సినిమా అవకాశం వచ్చినా కాదనకుండా ఒప్పేసుకుంటూ వెళ్ళింది.

Heroine Sreeleelas call sheets have become a problem for directors and producers News Goes Viral

దానికి తోడు శ్రీలీల గోల్డెన్ లెగ్ అనే పేరు పడటంతో వరుస సినిమా అవకాశాలు వస్తున్న ఏమాత్రం వెనుకాడకుండా వాటన్నింటినీ ఒప్పుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు కాల్ షీట్స్ తలనొప్పి మొదలైందని అంటున్నారు. వాస్తవానికి సినీ దర్శకనిర్మాతలు నటీనటుల పేమెంట్స్ అన్నీ కాల్ షీట్స్ ప్రకారం కానీ లేదా సినిమా మొత్తానికి గాని మాట్లాడుకుంటూ ఉంటారు.

సాధారణంగా హీరో హీరోయిన్లకి సినిమా మొత్తానికి ఇంతా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల కాల్ షీట్స్ ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. అయితే శ్రీలీల అనుకున్న కొన్ని సినిమాల్లో షూటింగ్ షెడ్యూల్స్ తేడా అవడంతో ఆమె ఇచ్చిన కాల్ షీట్స్ వల్ల మిగతా సినిమాల దర్శక నిర్మాతలకు ఇబ్బంది ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

Heroine Sreeleelas call sheets have become a problem for directors and producers News Goes Viral

ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి ఎలా ఉందంటే ఒకరోజు హైదరాబాదులో షూటింగ్ చేస్తే రెండో రోజు ఫారిన్ లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చేలా పరిస్థితి తయారయింది. ఈరోజు హైదరాబాదులో ఉండి రేపు విదేశాలకు వెళ్లడం అనేది అసాధ్యమైన పని కావడంతో ఆమె నిర్మాతలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Heroine Sreeleelas call sheets have become a problem for directors and producers News Goes Viral

సినిమాలు ఒప్పుకుంటున్న సమయంలోనే తాను బిజీగా ఉన్నానని తన పరిస్థితి ఇది అని చెబితే దర్శక నిర్మాతలు వేరే ఆప్షన్ చూసుకుంటారు. కానీ ఆమె కాల్ షీట్స్ ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేస్తానని హామీ ఇచ్చి మరీ సినిమాలో ఒప్పుకుంటుందని తీరా ఇప్పుడు పరిస్థితి ఏమో తేడాగా ఉంటుందని వారంతా వాపోతున్నారు.

Heroine Sreeleelas call sheets have become a problem for directors and producers News Goes Viral

సినీ పరిశ్రమలో లాంగ్ రన్ లో ఉండాలంటే ఈ పద్ధతి ఏమాత్రం కరెక్ట్ కాదని ఇలా చేస్తే కనుక కచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. అయితే మరి శ్రీలీల ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఇకమీదటైనా జాగ్రత్త పడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X