Sreeleela: అలాంటోడే కావాలంటున్న శ్రీలీల... అబ్బాయిలూ మీరేమైనా ట్రై చేస్తారా?
టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇక పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
కన్నడ బ్యూటీ శ్రీలీల తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. అమెరికాలో పుట్టి.. బెంగుళూరులో పెరిగిన శ్రీలీల... ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది. ఇక యాక్టర్ గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. 2019లో కిస్ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ... తెలుగులో పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. తొలి సినిమా తోనే ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీలీల.

ఇక శ్రీలీల తన యాక్టింగ్, గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకుంటూ.. వరుస ఆఫర్లు దక్కించుకుంది. రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాతో వరుస ఆఫర్లు అందుకుంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు టాప్ స్టార్స్ సైతం శ్రీలీల వెంటే పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 8 తెలుగు సినిమాలు, 2 కన్నడ సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీలీల ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, రామ్, బాలయ్య, నితిన్, నార్నే నితిన్ వంటి స్టార్స్ తో సైతం ఆమె నటిస్తోంది. ఈనెలలో శ్రీలీల స్కంధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ హీరోగా నటించగా... బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తర్వాత ఆమె భగవంత్ కేసరితో అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా నెలకు ఒక సినిమా చొప్పున శ్రీలీల ప్రేక్షకులను అలరించనుంది.
ఇక ఇదిలా ఉంటే... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల.. తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పుకొచ్చింది. తన ఫస్ట్ లవ్ తన అమ్మ అని చెప్పిన శ్రీలీల... మరెవ్వరితోనూ ప్రేమలో పడలేదని వెల్లడించింది. అలాగే తనకు కాబోయే భర్త గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలీల చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

శ్రీలీల చెప్పిన విషయం ఏంటంటే.... మాటలో నిలకడ ఉండాలి. సరదాగా ఉండాలి. ప్రతి విషయంలో ఓపిగ్గా వ్యవహరించాలి. నేర్పరితనం కలిగి ఉండాలి. పెద్దవారిని గౌరవించాలి. ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి శ్రీలీలకు ఎప్పటికి దొరుకుతాడో చూడాలి ఇక. ప్రస్తుతం ఈ బ్యూటీ సైమా వేడుకల్లో పాల్గొంటుంది.


Click it and Unblock the Notifications











