Sreeleela: శ్రీలీల గుండెలు కొయ్యమాకిలా... క్యూట్ లుక్స్‌తో హీటు పెంచేస్తోందిగా!
కన్నడ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిందనే విషయం తెలిసిందే. ఎందుకంటే.. ఇప్పుడు ఆమె చేతిలో కనీసం 10 సినిమాలు అయినా ఉన్నాయి. అవి కూడా స్టార్ హీరోల సరసనే. ఇక ఈ భామ డే అండ్ నైట్ షూటింగ్ లు చేస్తూ... మరోవైపు తన అందాన్ని కాపాడుకుంటూ... బాగానే కష్టపడుతుంది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామేతను ఈ భామ ఫాలో అవుతుందనుకుంటా. అందం ఉండగానే ఆఫర్లు అందించుకుంటూ.. దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా ఈ భామ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలను షేర్ చేసింది. వాటిపై ఓ లుక్ వేయండి మరి.
అమెరికాలో పుట్టి... బెంగళూరులో పెరిగి... సినిమాలపై మక్కువతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల. అలా రాఘవేంద్రరావు కంట పడిన ఈ బ్యూటీ... పెళ్లి సందD సినిమాతో తెలుగులోకి ఆరంగేట్రం చేసింది. ఇక అక్కడి నుంచి ఈ భామ నక్కతోక తొక్కినట్లు... పట్టిందల్లా బంగారం అయినట్లు... వరుసపెట్టి ఆమెకు ఆఫర్లు వచ్చి చేరాయి. ఇక ధమాకా సినిమాతో మరోసారి ఆమె మ్యాజిక్ చేసింది.

ఇక రవితేజ సరసన అందం, అభినయంతో పాటు.. డ్యాన్సులు చేసి షాక్ ఇచ్చింది. ఇక ఈమె ఎనర్జీ చూసి ప్రేక్షకులే షాక్ అయ్యారు. ఇక శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోలు బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ సరసన యాక్ట్ చేసే అవకాశం దక్కించుకుంది. అంతే కాదు.. కుర్రహీరోల సినిమాల్లోనూ ఈ భామే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ భామ భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇటీవల స్కంద సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ భామ మహేశ్ బాబు గుంటూరు కారం, నితిన్ ఎక్ట్స్రాఆర్టినరీ, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఇవే కాకుండా విజయ్ దేవరకొండ, నితిన్ నార్నే వంటి హీరోల సినిమాల్లో కూడా ఈ భామే హీరోయిన్ అని తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉండగా.. ఈ భామ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ... సమయం దొరికినప్పుడల్లా.. తన అందాలను ప్రదర్శిస్తోంది. తన ఫోటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ గా మారాయి. లాంగ్ డ్రెస్ లో శ్రీలీల ఫోటోలకు పోజులు ఇచ్చింది.
ఇక శ్రీలీల ఈ ఫోటోల్లో ఎద అందాలు ప్రదర్శించింది. ఇక వాటితో పాటు ఆమె క్యూట్ లుక్స్ చూస్తుంటే... హీట్ పెంచేలా ఉన్నాయి. ఇక ఈ ఫోటోల్లో శ్రీలీలను చూస్తే... గుండెల్ని కోసేలా ఉన్నాయి. ఇక నెటిజన్స్ కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. బ్యూటిఫుల్, మై బేబీ, లవ్, లుకింగ్ లైక్ చాక్లెట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లవ్ సింబల్స్ పెడుతూ కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











