Sreeleelaకు గట్స్ ఎక్కువే.. ఏకంగా Allu Arjunకే ఝలక్ ఇచ్చిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజులో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బన్నీ.. పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా బన్నీతో నటించే అవకాశాన్ని ఏ హీరోయిన్ వదులుకోదు. కానీ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల మాత్రం ఏకంగా బన్నీకే నో చెప్పింది. అదేంటో తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ గా బన్నీ...:మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ... తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ... స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక గత ఏడాది వచ్చిన పుష్ప సినిమాతో మాత్రం పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా... బన్నీను గ్లోబల్ స్టార్ ను చేసింది.

Heroine Sreeleela Rejects A Big Offer From Allu Arjun Viral in Social Media

అంతకు మించి పుష్ప2...:ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్.. పుష్పను మించి ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వేర్ ఇజ్ పుష్ప వీడియో.. సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అంతే కాదు మొన్న అల్లు అర్జున్ ఈ సినిమా నుంచి లీక్ చేసిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి పుష్పకు మించి పుష్ప 2 రాబోతుందని తెలుస్తోంది.

ఇండస్ట్రీని షేక్ చేసే పాట...:ఇక ఈ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్.. ఓ సెన్సెషన్ అనే విషయం తెల్సిందే. సమంత.. ఊ అంటావా.. మావా.. అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు ఇలాంటి పాట పుష్ప 2లో కూడా అంతకు మించి ప్లాన్ చేయాలని అనకున్నారట మేకర్స్. ఇందుకోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నాడని సమాచారం. ముఖ్యంగా సామ్ లా ఐటెంసాంగ్ చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని టాక్. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి రాగా... శ్రీలీల అయితే బాగుంటుందని మేకర్స్ భావించారు.

Heroine Sreeleela Rejects A Big Offer From Allu Arjun Viral in Social Media

బన్నీకే నో చెప్పిన శ్రీలీల...:ఇక ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అంటే.. శ్రీలీల. వరుస సినిమాలు చేస్తూ.. చేతినిండా ప్రాజెక్టులతో నిమిషం ఖాలీ లేకుండా శ్రీలీల గడుపుతోంది. అయితే పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు మేకర్స్.. శ్రీలీలను అప్రోచ్ అయ్యారని సమాచారం. అయితే దానికి శ్రీలీల నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోలో హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల.. ఐటెం సాంగ్ చేయాలనుకోవడం లేదని తెలుస్తోంది.

Heroine Sreeleela Rejects A Big Offer From Allu Arjun Viral in Social Media

ఎవరికో ఆ అదృష్టం:ఇక అల్లు అర్జున్ తో నటించే అవకాశాన్ని ఏ హీరోయిన్ వదులుకోదు. అలాంటిది శ్రీలీల.. బన్నీకి నో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బన్నీ నో చెప్పి శ్రీలీల పెద్ద సాహసమే చేసిందని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ ఎవరికి వస్తోందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X