Sreeleela: రూ.5లక్షలతో కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీలీల.. భగవంత్ కేసరికి ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?

టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ భామ అయినప్పటికీ... తెలుగులో తనదైన సత్తాతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయింది. బాలయ్య కూతురిగా నటించి.. మంచి పేరు కొట్టేసింది ఈ భామ. అయితే ఐదు లక్షలతో కెరియర్ ప్రారంభించిన ఈ భామ భగవంత్ కేసరి సినిమా కోసం బాగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్నడ భామ శ్రీలీల.. తెలుగులోకి పెళ్లి సందడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక ఈ మూవీతో ఆమె అందరినీ ఆకట్టుకుంది. కీరవాణి అందించిన సంగీతం ఆకట్టుకోగా.. సినిమా ప్యామిలీ ఆడియెన్స్ కి, యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీశారు. ఇక ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రీలీల... ఈ సినిమా కోసం 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంది.

Heroine Sreeleela Shocking Remuneration For Balakrishna Anil Ravipudi Bhagavanth Kesari Movie Full Details Here

ఇక రెండో సినిమా రవితేజ ధమాకాలో నటించే అవకాశం వచ్చింది.ఇక ఈ సినిమాలో శ్రీలీల రెచ్చిపోయి నటించింది. నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు రవితేజ ధమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాకు రూ.30లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక మూడో సినిమా స్కందకు కోటీ రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Heroine Sreeleela Shocking Remuneration For Balakrishna Anil Ravipudi Bhagavanth Kesari Movie Full Details Here

ఇక స్కంధ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఆమె చేతిలో ఉన్న మరో మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురిగా విజ్జి పాపగా శ్రీలీల యాక్టింగ్ ఇరగ దీసిందని అంటున్నారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ మరో కీలక పాత్రలో నటించింది.

అయితే శ్రీలీల తన కెరియర్ ను రూ.5లక్షల రూపాయలతో మొదలు పెట్టింది. అయితే భగవంత్ కేసరి కోసం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక ఈ సినిమా కోసం శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ పెంచేసింది. కాజల్ ఆగర్వాల్ ఈ సినిమా కోసం రూ.2 కోట్ల రూపాయలు తీసుకుంటే.. శ్రీలీల కూడా ఆమెకు సమానంగా రూ.1.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ మూవీలో శ్రీలీల పాత్ర చుట్టే సినిమా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం వసూలు చేయడంలో తప్పులేదని అంటున్నారు ఫ్యాన్స్.

Heroine Sreeleela Shocking Remuneration For Balakrishna Anil Ravipudi Bhagavanth Kesari Movie Full Details Here

ఇక భగవంత్ కేసరి సక్సెస్ తో జోష్ మీద ఉన్న శ్రీలీల.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె చేతిలో ఇంకో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. నెలకో సినిమా విడుదల చేసినా... ఆమె సినిమాలు ఒడవవు. డై అండ్ నైట్ షూటింగులతో శ్రీలీల బిజి బిజిగా గడుపుతుంది. త్వరలో ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్టినరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ భామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X