మహేష్, త్రివిక్రమ్ సినిమాకు మరో తలనొప్పి.. హీరోయిన్ సడన్ ట్విస్ట్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న మూడో సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అతడు ఖలేజా సినిమాల అనంతరం చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడు. పైగా అల.. వైకుంఠపురములో అనంతరం త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. మరొకవైపు రాజమౌళి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంటే ముందుగానే మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కాబట్టి సినిమా తప్పకుండా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ కొన్ని ప్రీ ప్రొడక్షన్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక మరొక ముఖ్యమైన పాత్ర కోసం శ్రీలీలా అనే కన్నడ హీరోయిన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. సాధారణంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు తీసుకుంటాడు. ఒక హీరోయిన్ కథకు తగ్గట్టుగా ప్రధాన పాత్రలో కనిపిస్తూ ఉంటారు. మరొక హీరోయిన్ కూడా కథలో భాగంగానే ఉంటుంది కానీ ఆమెకు సెకండ్ హీరోయిన్ ట్యాగ్ ఉంటుంది. కమర్షియల్గా అన్ని రకాలుగా ఆలోచించే త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్ గ్లామర్ ప్రెజెంటేషన్ లో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

heroine sreeleela shocking twist to director trivikram srinivas

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోయే మరికొన్ని రోజుల్లో త్రివిక్రమ్ కు మరొక సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఒక హీరోయిన్ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో బుట్టబొమ్మను మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకో గా మరొక ముఖ్యమైన పాత్ర కోసం పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ బ్యూటీకి ప్రస్తుతం అయితే మంచి డిమాండ్ వుంది. అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఇలాంటి సమయంలో త్రివిక్రమ్.. మహేష్ బాబు సినిమాలో ఆమెకు ఒక చిన్న పాత్ర ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

క్యారెక్టర్ కు అనుకున్నంతగా ప్రాధాన్యత లేదని ఈ బ్యూటీకి అర్థమైందట. త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా అనగానే ఆమె కథ గురించి పెద్దగా ఆలోచించకుండా ఒప్పేసుకుందట. ఇక ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది అని ప్రాజెక్టు నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ మాత్రం శ్రీ లీల కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ విషయంలో మరో ఆలోచనకు రావడం లేదట. వీలైతే ఆమె పాత్రను మరికొంత పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరపైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X