Mahesh Babu: మహేష్ బాబు కోసం పరీక్ష తప్పిన యంగ్ హీరోయిన్.. కెరీర్ కోసం అలా త్యాగం!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం ఓ యంగ్ హీరోయిన్ పరీక్షలు తప్పింది. కెరియర్లో డాక్టర్ గా ఎదగాల్సిన ఆ బ్యూటీ.. మహేశ్ కోసం త్యాగం చేసేసింది. ఆమె ఎవరో ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఈ బ్యూటీ డాక్టర్ కోర్సు చేస్తుందనే సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇచ్చి ముంబై వెళ్లి.. పరీక్షలు రాస్తుండగా.. ఇప్పుడు మహేశ్ కోసం ఆ పరీక్షలకు ఎగనామం పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కన్నడ బ్యూటీ శ్రీలీల.. పుట్టింది బెంగళూరులో అయినా.. పెరిగింది మాత్రం యూఎస్ లో. అయితే శ్రీలీల తల్లి డాక్టర్ అని చాలా మందికి తెలుసు. ఇక ఈ బ్యూటీ కూడా ఎంబీబీఎస్ కోర్సూ చేస్తుందని ఇప్పటికే చాలా మందికి తెలుసు. డాక్టర్ కావాల్సిన ఈ బ్యూటీ.. యాక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓ వైపు చదువు.. మరోవైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది.

ఇక టాలీవుడ్ లోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రవితేజతో ధమాకా అనే సినిమా చేసి సెన్సేషన్ అయింది. ఈ సినిమా తర్వాత ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. చేతికి వచ్చిన సినిమాలు అన్నీ చేసుకుంటూ పోయింది. స్కంధ, భగవంత్ కేసరి, ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డీనరి అంటూ వరుస సినిమాలు చేసింది. అయితే సక్సెస్ రేటు మాత్రం తగ్గుతూ వస్తుంది. ఈమె చేసిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ మహేశ్ బాబు మీదే పెట్టుకుంది. గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబుతో కలిసి ఈ భామ నటిస్తుంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ సినిమా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి ముంబై చెక్కిసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 18 తరువాత నుంచి 24 వరకు ముంబైలో డాక్టర్ పరీక్షలు రాస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ భామ మహేశ్ బాబు కోసం తన కెరియర్ ను త్యాగం చేసినట్లు తెలుస్తోంది.

మహేశ్ బాబు గుంటూరు కారం షూటింగ్ కోసం శ్రీలీల... తన ఎంబీబీఎస్ పరీక్షలు త్యాగం చేసిందని ఓ వార్త బయటకు వచ్చింది. సప్లిమెంటరీలో రాసుకుంటా అని చెప్పి... వెనక్కు వచ్చి షూటింగ్ లో పాల్గొందని తెలుస్తోంది. ఇక ఈ భామ మీద కొన్ని డ్యాన్స్ సీన్లు తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీతో కలిసి రేపు మహేశ్ బాబు షూటింగ్లో జాయిన్ కానున్నారని సమాచారం. మొత్తానికి శ్రీలీల మహేశ్ బాబు సినిమా కోసం తన పరీక్షలను తప్పుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఓ మై బేబీ అనే సాంగ్ లో శ్రీలీల.. మహేశ్ పెయిర్ చూసి.. క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్స్. ఇక ఈ సినిమాలో శ్రీలీల పేరు అమ్ము కాగా.. మహేశ్ పేరు రమణ అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











