International Yoga Day యోగాసనాలతొ అదరగొట్టిన శ్రీలీల.. యోగా ఈవెంట్‌లో మెరిసిన ధమాకా భామ

ప్రతీ ఏడాది ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిసున్నది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగాపై అవగాహన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. ప్రతీ ఏటా ఆరోగ్య భద్రత గురించి తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.

అయితే ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రతిష్టాత్మకంగా యోగా డే ను నిర్వహించేందుకు నెల రోజుల ముందుగానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన యోగా ఈవెంట్‌లో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల పాల్గొనడమే కాకుండా అందరికి స్పూర్తిగా నిలిచింది. ఈ వేడుక వివరాల్లోకి వెళితే..

International Yoga Day

వరల్డ్ యోగా డే ఈవెంట్‌ను పురస్కరించుకొని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఇటీవల మీడియాతో మాట్లాడారు. యోగా డేకు ముందు యోగా ఆర్గనైజేషన్ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నది. జూన్ 21 తేదీన నిర్వహించే గ్రాండ్ ఈవెంట్‌లో భాగంగా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రతీ రోజు యోగా ఆర్గనైజేషన్ నిర్వహించే ఈవెంట్‌లో ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలి. 25 రోజుల ముందే ఈ వేడుకలను ప్రారంభించాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి అని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

International Yoga Day

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపుకు సానుకూలంగా స్పందించిన టాలీవుడ్ సంచలన హీరోయిన్ శ్రీలీల యోగా వేడుకల్లో పాల్గొన్నారు. నలుపు రంగు ట్రాక్ సూట్‌ ధరించి యోగాసనాలు వేశారు. నలుపు రంగు ట్రాక్ సూట్‌లో అందంగా కనిపించారు. శ్రీలీల యోగా ఈవెంట్‌కు రావడంతో అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.

International Yoga Day

యోగా ఆర్గనైజేషన్ నిర్వహించిన యోగా ఈవెంట్‌లో శ్రీలీల పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడింది. నేను వర్కువుట్స్ చేయడానికి ఇష్టపడను. ప్రతీ రోజు నేను యోగా చేస్తుంటాను. నా ఆరోగ్యాన్ని అలా పరిరక్షించుకొంటాను. ప్రతీ ఒక్కరు సాంప్రదాయమైన యోగాను ప్రాక్టీస్ చేయాలి అని శ్రీలీల సూచించారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తున్నారు. బాలకృష్ణ, రామ్, బోయపాటి చిత్రంలోను, పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లోను ఈ భామ నటిస్తున్నది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రంలో అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉండటం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X