Sreeleela : స్టార్ స్టేటస్.. కోట్ల ఆస్తి ఉన్నా.. ఆ విషయంలో మాత్రం ఎంతో దురదృష్టవంతురాలట!
తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే హీరోయిన్లే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే ఆరంభంలో సెన్సేషన్‌గా మారుతుంటారు. అలాంటి వారిలో క్యూట్ గార్ల్ శ్రీలీల ముందు వరుసలో ఉంటుంది. అందం, అభినయంతో.. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఫిదా చేస్తున్న ఈ కుర్రది.. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. కానీ ఆమె ఆ విషయంలో మాత్రం ఎంతో దురదృష్టవంతురాలు. అవును ఇది నిజం! వివరాళ్లోకి వెళితే..
అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుని బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది అందాల సుందరి శ్రీలీల. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందD చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం యావరేజ్‌గా ఆడినప్పటికీ శ్రీలీల క్యూట్ యాక్టింగ్, గ్లామర్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత రవితేజ 'ధమాకా' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.100కోట్ల హిట్ హీరోయిన్గా మారిపోయింది!

ధమాకా సక్సెస్‌తో వరుసగా...: అలా ధమాకా సక్సెస్‌తో శ్రీలీలకు వరుసగా సినీ అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ప్రతిఒక్కరూ ఆమెతో నటించేందుకు రెడీ అయిపోతున్నారు. దర్శకనిర్మాతలకు లక్కీ గర్ల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. బాలకృష్ణ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నితిన్, రామ్పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఆమె చేతిలో మొత్తంగా పదికి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే ఇంతటి అదృష్టం ఉన్న ఈ భామ.. ఆ విషయంలో మాత్రం దురదృష్టవంతురాలే.

చిన్నప్పుడే డివొర్స్..: ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇంతటి పాపులరిటీ, పబ్లిసిటీ, క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. తన జీవితంలో ఎంతో మధురమైన బాల్యాన్ని మాత్రం ఎంతగానో మిస్ అయిందని తెలిసింది. మరీ ముఖ్యంగా ఆమె జీవితంలో తండ్రి ఉన్నా లేనట్టుగానే జీవించిందని కథనాలు కూడా వచ్చాయి. చిన్నవయసులోనే తండ్రి ప్రేమను కోల్పోయిందట. శ్రీలీల చిన్నవయసులోనే తన అమ్మానాన్న మనస్పర్థల కారణంగా డివొర్స్ తీసుకున్నారట. ఆ తర్వాత శ్రీలీల తన అమ్మ దగ్గరే పెరిగిందట. ఆ సమయంలో తండ్రిని బాగా మిస్ అయిందట. ఆయన ప్రేమ ఈ ముద్దుగుమ్మకు దక్కలేదు.

అలా సినిమాల్లోకి..: ఆ తర్వాత టీనేజ్‌లో ఉన్నప్పుడే భరత నాట్యం వంటి గొప్ప కళను నేర్చుకుంది శ్రీలీల. ఆ తర్వాత కెరీర్లో డాక్టర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని మెడిసిన్ విద్యాభ్యాసం చేసింది. కానీ అనుకోని విధంగా 2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా మారింది. అలా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కెరీర్ ప్రారంభించాక కూడా చదువును కొనసాగించింది.

దురదృష్టవంతురాలని కామెంట్స్..: ఇక శ్రీలీల బయోగ్రఫీ తెలుసుకుంటున్న నెటిజన్లు, సినీ ప్రియులు.. ఎంత క్రేజ్ ఉన్నా నాన్న పిలుపునకు దూరమైందని, తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల ఈ ఒక్క విషయంలో మాత్రమే దురదృష్టవంతురాలు అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











