Sreeleela: పెళ్లై పిల్లలున్న స్టార్ హీరో ప్రేమలో పడిపోయిన శ్రీలీల... ఇంతకీ ఆయన ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల... పెళ్లిసందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి... అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భామ చేతిలో ఏకంగా 10 నుంచి 12 సినిమాలు ఉన్నాయి. అయితే ఈ భామ ఓ స్టార్ హీరో ప్రేమలో పడిపోయిందట. అంతే కాదు.. ఆ హీరోకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా అతనే నా కలల రాకుమారుడు అంటూ కామెంట్స్ చేసింది ఈ భామ. ఇంతకీ ఆయన ఎవరు.. ఎందుకలా శ్రీలీల చెప్పింది.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫుల్ బిజియెస్ట్ హీరోయిన్ : కన్నడ భామ శ్రీలీల టాలీవుడ్ లో పెళ్లి సందడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాలో నటించి సెన్సేషన్ సృష్టించింది. శ్రీలీల యాక్టింగ్, డ్యాన్సులు, అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. ఇక ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. దాదాపు ఈ భామ చేతిలో 10 నుంచి 12 సినిమాలు ఉన్నాయి.

సూపర్ క్రేజ్ : ఇక శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమెను ఇప్పుడు చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేయడానికి మేకర్స్ పిలుస్తున్నారు. మొన్నటికి మొన్న బ్రహ్మాజీ కొడుకు స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రమోషన్స్ లో శ్రీలీల పాల్గొంది. ఇక ఇప్పుడు మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటోంది. ఇతర హీరోల సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా శ్రీలీలను ఆహ్వానిస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పెళ్లైన వ్యక్తి ప్రేమలో : ఇటీవల శ్రీలీల మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమానికి శ్రీలీలతో పాటు సిద్దు జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ కూడా అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో తను ఒకరి ప్రేమలో పడ్డారని వెల్లడించింది. ఆ వ్యక్తి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు చెప్పుకువచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. దుల్కర్ సల్మాన్. ఆయనకు ఇప్పటికే పెళ్లై పాప కూడా ఉంది. ఇలా దుల్కర్ సల్మాన్ ను చూసే సరికి శ్రీలీల తన ప్రేమను బయటపెట్టింది.

దుల్కర్ రాకుమారుడు : శ్రీలీల మాట్లాడుతూ... సార్ మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. మిమ్మల్ని అడిగానని చెప్పమంది కూడా. నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీద వస్తున్న యువరాజుని నేను ఊహించుకున్నాను. మీ హీరేయ్ అన్న పాట చూసిన ప్రతిసారి మీరే నా రాకుమారుడు అని అనిపించేది అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ఇక దుల్కర్ కూడా ఆమెకు థ్యాంక్స్ చెప్పాడు.
శ్రీలీల కామెంట్స్ వైరల్ : ఇక శ్రీలీల దుల్కర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక మరోవైపు శ్రీలీల ఇటీవల స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











