Sreeleela: అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల.. మోసాన్ని ఫ్రూఫ్‌తో సహా బయటపెట్టిన నెటిజన్స్!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చేసింది మూడు, నాలుగు సినిమాలు అయినా... అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఈ భామ భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల.. లిప్ లాక్ సీన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే ఆమె చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని నెటిజన్స్ తెల్చేశారు. శ్రీలీల మోసం చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కన్నడ భామ శ్రీలీల.. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో శ్రీలీల తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ధమాకా చిత్రంలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగా... శ్రీలీల డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొట్టింది. ఇక ఈ భామకు వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. మొన్న స్కంద సినిమాతో అలరించిన ఈ భామ.. రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో ఆకట్టుకుంది.

ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. మరోవైపు వేరే సినిమాల షూటింగులతో బిజి బిజిగా గడుపుతుంది. టాలీవుడ్ లో ఈ భామ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. యంగ్ హీరో నుంచి.. సీనియర్ హీరో వరకు అందరికి శ్రీలీలనే ఛాయిస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఇక డే అండ్ నైట్ షూటింగులతో బిజిగా ఉంటుంది ఈ భామ.
ఇక బాలయ్యతో కలిసి నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటించింది. అంతే కాదు కాజల్ ఆగర్వాల్ ఓ కీ రోల్ లో నటించింది. తమన్ అందించిన సంగీతం.. అనిల్ రావిపూడి మార్క్.. బాలయ్య యాక్షన్, డైలాగ్స్, శ్రీలీల అందం అభినయం మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది.

ఇక భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీలను టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. ఇక శ్రీలీల తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని తేల్చి చెప్పింది. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక... తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పుకువచ్చింది. మొత్తంగా తాను లిప్ లాక్ సీన్లు చేసే ప్రసక్తే తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయితే ఈ నేపథ్యంలోనే నెటిజన్స్... శ్రీలీల మోసం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఇదివరకే ఆమె ఓ కన్నడ సినిమాలో లిప్ లాక్ సీన్ చేసింది. ఇప్పటి వరకు చేయలేదని చెప్పి... తన భర్తకే ఇస్తానంటూ చెప్పిన శ్రీలీల.. ఇదేంటి అంటూ ఫ్రూఫ్ తో సహా బయటపెట్టారు. ఆ సినిమాలోని లిప్ లాక్ సీన్స్ కట్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక శ్రీలీల ఓ కన్నడ సినిమా ఐ లవ్ యూ ఇడియట్ అనే సినిమాలో నటించింది. అందులో హీరో విరాట్ కు లిప్ లాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనితో శ్రీలీల చేసిన కామెంట్స్ అబద్ధమని తేలింది.


Click it and Unblock the Notifications











